For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sreemukhi: దిల్ రాజును ఇమిటేట్ చేసిన యాంకర్ శ్రీముఖి.. వేనుమా, ఇరుక్కు అంటూ ఘోరంగా!

  |

  టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. నితిన్ దిల్ సినిమాకు నిర్మాతగ వ్యవహరించిన ఆయన అదే సినిమా టైటిల్ ఆయన ఇంటి పేరుగా మారింది. ఎన్నో హిట్టు చిత్రాలు నిర్మించిన ఆయన ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తో వారసుడు సినిమా నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బైలింగువల్ చిత్రంగా తెలుగు, తమిళంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడిన స్పీచ్ పై ఇప్పటికే తెగ ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోతాజాగా యాంకర్ శ్రీముఖి దిల్ రాజు డైలాగ్స్ తో షాక్ ఇచ్చింది.

  కామెడీ టైమింగ్ తో..

  కామెడీ టైమింగ్ తో..


  సినీ చిత్ర పరిశ్రమలోకి 2012లో అడుగు పెట్టిన శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పటాస్ షోలో యాంకర్ రవితో శ్రీముఖి చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో, అప్పుడప్పుడు రవికి ముద్దులు పెట్టినట్లుగా చేస్తూ.. ఆద్యంతం షోని ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.

  అల్లు అర్జున్ కు చెల్లెలుగా..

  అల్లు అర్జున్ కు చెల్లెలుగా..


  ఓవైపు సినిమాలు.. మరోవైపు బుల్లితెరపై సత్తా చాటుతూ రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేసుకుంది యాంకర్ శ్రీముఖి. అయితే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా పాటు లీడ్ యాక్ట్రస్ గా నటించి ఫుల్ పాపులర్ అయింది.

  అనేక టీవీ షోలతో..

  అనేక టీవీ షోలతో..

  సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసింది పేరు తెచ్చుకుంది.

   బీబీ జోడీకి యాంకర్ గా..

  బీబీ జోడీకి యాంకర్ గా..

  బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-శ్రీసత్య, కౌశల్-అభినయ శ్రీ జోడీలుగా ఉన్నారు. అలాగే దీనికి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు.

  జడ్జెస్ ఛాలెంజ్ లో భాగంగా..

  జడ్జెస్ ఛాలెంజ్ లో భాగంగా..

  అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో జోడీలంతా తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. డిఫరెంట్ క్యాస్టూమ్స్ తో.. విభిన్న రకాల థీమ్స్ తో, సూపర్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే జడ్జెస్ ఛాలెంజ్ ఇచ్చిన ఈ రౌండ్స్ లో అదిరిపోయే డ్యాన్స్ లతో పాటు బిగ్ బాస్ షో తరహాలో గొడవలు కూడా జరిగాయి.

   రొమాన్స్ వేనుమా..

  రొమాన్స్ వేనుమా..

  బీబీ జోడీ తాజా ప్రోమో గురించి చెబుతూ.. దిల్ రాజు డైలాగ్స్ ను ఇమిటేట్ చేసింది యాంకర్ శ్రీముఖి. మీకు డ్యాన్స్ వేనుమా.. డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేనుమా.. కంటెస్టెంట్ల మధ్య ఫైట్స్ ఇరుక్కు, ఎంటర్టైన్ మెంట్ వేనుమా.. ఎంటర్టైన్ మెంట్ సూపరా ఇరుక్కు, సెంటిమెంట్ వేనుమా.. సెంటిమెంట్ ఇరుక్కు, రొమాన్స్ వేనుమా... అంటూ కౌశల్-అభినయ శ్రీల ఘాటు రొమాన్స్ చూపించిన తర్వాత.. అది దా బీబీ జోడీ అమ్మా అని అచ్చం దిల్ రాజు స్టైల్ లో యాంకర్ శ్రీముఖి షాకింగ్ గా చెప్పిన చివరికీ నవ్వు తెప్పించింది.

  దిల్ రాజు స్పీచ్ పై ట్రోలింగ్..

  దిల్ రాజు స్పీచ్ పై ట్రోలింగ్..

  అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ తో వారసుడు సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో బాగానే ప్రమోట్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా హాజరైన దిల్ రాజు.. వారిసు చిత్రాన్ని, విజయ్ ను పొగుడుతూ పలు కామెంట్స్ చేశారు. ఫైట్స్ ఇరుక్కు, డ్యాన్స్ ఇరుక్కు, రెండు కాఫీ కప్స్, అది దా సార్.. అంటూ దిల్ రాజు మాట్లాడారు. ఈ మాటలపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఈ డైలాగ్స్ తో కొంతమంది రీమిక్స్ సాంగ్స్ ల కంపోజ్ చేశారు. ఇప్పుడు అదే స్టైల్ లో యాంకర్ శ్రీముఖి మాట్లాడం చర్చనీయాంశమైంది.

  English summary
  Anchor Sreemukhi Making Fun On Dil Raju Varisu Movie Promotion Dialogue In BB Jodi Dance Reality Show Latest Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X