For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్‌‌లో అతడికి ముద్దు పెట్టిన శ్రీముఖి: మళ్లీ అదే తప్పు చేస్తూ.. వీడియో వైరల్ అవడంతో ఇంట్లో రచ్చ

  |

  సినిమా నటిగా తెలుగు వాళ్లకు పరిచయమై.. ఆ తర్వాత యాంకర్‌గా మారి రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్ పరంగా సక్సెస్ అయినప్పటికీ.. వ్యవహార శైలితో మాత్రం విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు ట్రోల్స్‌ బారిన పడిన శ్రీముఖి.. తాజాగా ఓ షోలో రెచ్చిపోయింది. ఏకంగా ఒకరికి ముద్దు పెట్టేసి షాకిచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  #HBDSreemukhi: It's Time To Party First Look Out | Filmibeat Telugu
   వెండితెర నుంచి బుల్లితెర మీదకు

  వెండితెర నుంచి బుల్లితెర మీదకు

  అల్లు అర్జున్ ‘జులాయి' సినిమాతో నటిగా పరిచయం అయింది శ్రీముఖి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘అదుర్స్' అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అద్భుతమైన యాంకరింగ్‌తో అలరిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఫలితంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోందీ బ్యూటీ.

  యాంకర్ శ్రీముఖి అందాల విందు.. ఇంతకు ముందెన్నడూ చూడని హాట్ ఫొటోలతో రచ్చ

  కెరీర్ సక్సెస్... వివాదాలు మాత్రం

  కెరీర్ సక్సెస్... వివాదాలు మాత్రం

  సినిమాలు, కార్యక్రమాలు, మూవీ ఫంక్షన్‌లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో రకాలుగా బిజీగా ఉంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది యాంకర్ శ్రీముఖి. అయితే, పర్సనల్‌గా మాత్రం ఆమె ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. గతంలో ‘పటాస్' షోలో యాంకర్ రవితో కలిసి వ్యవహరించిన తీరుతో విమర్శల పాలైన ఆమె.. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు, రొమాన్స్‌తో రచ్చ చేసింది.

  ముద్దులు.. రొమాంటిక్ డ్యాన్స్‌తో

  ముద్దులు.. రొమాంటిక్ డ్యాన్స్‌తో

  కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్రీముఖి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఓ షోలో భాగంగా అతడితో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఏకంగా అందరి ముందే అతడికి ముద్దులు ఇచ్చింది. దీంతో ఆ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో శ్రీముఖిపై విమర్శల వర్షం కూడా ఓ రేంజ్‌లో కురిసింది.

  మళ్లీ అతడికి కిస్ ఇచ్చిన శ్రీముఖి

  వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ‘కామెడీ స్టార్స్' షో ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఎపిసోడ్‌కు శ్రీముఖి గెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకు శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖి మరోసారి శేఖర్ మాస్టర్‌తో డ్యాన్స్ చేసింది. అంతేకాదు, అతడి బుగ్గపై ముద్దు కూడా పెట్టేసి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది.

  ఇంట్లో రచ్చ జరిగిందని కామెంట్

  ఇంట్లో రచ్చ జరిగిందని కామెంట్

  శ్రీముఖి ముద్దు పెట్టిన తర్వాత ఆమె గెటప్ వేసుకున్న ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. ‘మొన్న నేను మీకు పెట్టిన ముద్దు మొత్తం వైరల్ అయింది తెలుసా' అని అంటాడు. దీనికి జడ్జ్ సీటులో కూర్చుని ఉన్న శేఖర్ మాస్టర్ స్పందిస్తూ ‘ఆ ముద్దు సీన్ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

  రవికృష్ణతో లవ్ ట్రాకుపై నోరు విప్పిన నవ్య స్వామి: ఎత్తుకుని తిప్పుతూ.. అందరి ముందే ఊహించని విధంగా!

  మళ్లీ అదే తప్పు చేయడంతో ట్రోల్స్

  మళ్లీ అదే తప్పు చేయడంతో ట్రోల్స్

  ఇక, ఈ ప్రోమో కింద నెటిజన్లలో చాలా మంది శ్రీముఖి తీరును విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో శేఖర్ మాస్టర్‌కు ముద్దు పెట్టిన సమయంలో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. అయినప్పటికీ అది ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యాంకరమ్మ మరోసారి అదే తరహాలో కిస్ ఇచ్చింది. దీంతో చాలా మంది శ్రీముఖిని ఏకిపారేస్తున్నారు. కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా రిప్లైలు ఇస్తున్నారు.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Recently Participated in Comedy Stars Friendship Day special Show. In This Show She Gave Kisses to Choreographer Sekhar Master.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X