For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ షోలో హద్దులు దాటిన శ్రీముఖి: అతడికి నిజంగానే ముద్దులు పెడుతూ.. ఏకంగా ఆయనే భార్యకే అలా మెసేజ్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది గ్లామరస్ బ్యూటీ శ్రీముఖి. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో బెస్ట్ హోస్టుగా పేరు తెచ్చుకున్న ఈమె.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గేమ్‌ షోలో పాల్గొన్న రాములమ్మ.. శేఖర్ మాస్టర్‌కు నిజంగానే ముద్దులు పెట్టేసింది. అంతేకాదు.. ఆ తర్వాత ఆయన భార్యకు ఓ మెసేజ్ కూడా పంపించింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. హీరోయిన్‌గా

  అలా మొదలైన కెరీర్.. హీరోయిన్‌గా

  సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తోన్న సమయంలో అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' ఛాన్స్ పట్టేసింది శ్రీముఖి. ఆ సినిమాలో ఆకట్టుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలోనే ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

  యాంకర్‌గా ఎంటర్.. వరుస ఆఫర్లతో

  యాంకర్‌గా ఎంటర్.. వరుస ఆఫర్లతో

  వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడే శ్రీముఖి ‘అదుర్స్' అనే షోతో యాంకర్‌గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఆమె వరుస షోలతో సత్తా చాటుతూనే ఉంది. సుదీర్ఘమైన ఆమె ప్రయాణంలో ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది', ‘పటాస్' వంటి షోలతో పాటు స్పెషల్ ఈవెంట్లనూ చేసి హవా చూపిస్తోంది.

   ఈ మధ్య పెద్దగా కనిపించని శ్రీముఖి

  ఈ మధ్య పెద్దగా కనిపించని శ్రీముఖి

  శ్రీముఖి చివరిగా ‘బొమ్మ అదిరింది' అనే షోలో హోస్టుగా చేసింది. అది ఆగిపోయిన తర్వాత ఆమె పలు సినిమా ఫంక్షన్లతో పాటు పండుగ ఈవెంట్లనే చేసింది. ఇక, ఈ మధ్య మాత్రం ఈ బ్యూటీ పెద్దగా ఏ షోలోనూ కనిపించడం లేదు. అయితే, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలను వదులుతూ తెగ హల్‌చల్ చేసేస్తుందామె.

  ఇప్పుడలా బిజీ అయిపోయిన భామ

  ఇప్పుడలా బిజీ అయిపోయిన భామ

  చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీముఖి.. ఈ మధ్య వెండితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, బాలీవుడ్ మూవీ ‘అంధాధున్'కు రీమేక్‌గా నితిన్ నటిస్తోన్న కొత్త చిత్రం ‘మాస్ట్రో'లోనూ కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే మరికొన్నింటినీ లైన్‌లో పెట్టింది.

  ఆ షోలోకి ఆయనతో కలిసి వచ్చింది

  ఆ షోలోకి ఆయనతో కలిసి వచ్చింది

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య పెద్దగా షోలు చేయకున్నా.. అప్పుడప్పుడూ ఏదో ఒక కార్యక్రమానికి గెస్టుగా వచ్చి అలరిస్తుంది శ్రీముఖి. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రారంభం అయిన ‘సిక్త్ సెన్స్' అనే గేమ్ షోలోకి గెస్టుగా వచ్చింది. ఆమెతో పాటు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా వచ్చాడు. ఓంకార్ నిర్వహించే ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా విడుదలైంది.

  అతడికి నిజంగానే ముద్దులు పెట్టింది

  ‘సిక్త్ సెన్స్' నాలుగో సీజన్ ప్రోమోలో శ్రీముఖి హద్దులు దాటేసినట్లు కనిపించింది. ఇందులో ఏకంగా శేఖర్ మాస్టర్‌ బుగ్గపై బోలెడన్ని ముద్దులు పెట్టేసింది. అంతేకాదు, ఆయనతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. అలాగే, నడుము తిప్పుతూ వయ్యారాలు ఒలబోసింది. ఇక, ఓంకార్‌ను కూడా బావ అని పిలుస్తూ విపరీతంగా రచ్చ రచ్చ చేసిందీ బ్యూటీ.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   ఏకంగా ఆయనే భార్యకే అలా మెసేజ్

  ఏకంగా ఆయనే భార్యకే అలా మెసేజ్

  శేఖర్ మాస్టర్‌కు ముద్దులు పెట్టిన తర్వాత ఏకంగా ఆయన భార్యకే మెసేజ్ ఇచ్చింది శ్రీముఖి. అప్పుడు మీ భార్య పేరు ఏంటి అని ఆయనను అడిగిన ఈ యాంకర్.. ‘శిరీష గారూ.. నేను నిజంగా ముద్దులు పెట్టలేదు. ఇవి కేవలం కల్పితాలు మాత్రమే. కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో రూపొందించారు' అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Recently Participated in Ohmkar's Sixth Sense Season 4 with Sekhar Master. In This Show She Gave Kisses to That Choreographer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X