Sreemukhi: గంగుబాయ్ స్టైల్‌లో శ్రీముఖి న్యూలుక్.. తెల్లచీర, నల్ల కళ్లజోడ్‌తొ కొత్త అవతారం
తెలుగు యాంకర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీముఖి గ్లామర్ తో కూడా తరచుగా ఆశ్చర్యపరిస్తూ ఉంటుంది. ఆమె ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా శ్రీముఖి గంగుబాయ్ ఖతీయవాడి స్టైల్ లో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

మొదట సినిమాలతో..
మొదట నటిగా కొన్ని చిన్న తరహా పాత్రల్లో నటించిన శ్రీముఖి ఆ తరువాత ప్రధాన పాత్రలు చేసే వరకు వచ్చింది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె సిస్టర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత పలు బిగ్ మూవీస్ లో కూడా కీలకమైన పాత్రల్లో నటించింది. మేయిన్ లీడ్ లో కూడా శ్రీముఖి క్లిక్ అవ్వాలని ప్రయత్నాలు చేసింది కానీ ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.

మొదట ఆ షో కోసం..
అయితే ఒకవైపు శ్రీముఖి సినిమాలో నటిస్తూనే మరొకవైపు టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని ప్రయత్నాలు చేసింది. మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే వచ్చిన మరొక అద్భుత అవకాశాన్ని కూడా అనుకోకుండా మిస్ చేసుకుంది. జబర్దస్త్ లో మొదట శ్రీముఖిని యాంకర్ గా సెలెక్ట్ చేశారు. కానీ ఆమె మొదట్లో ఆ షోపై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో అనసూయ భరద్వాజ్ ఆ అవకాశాన్ని అందుకొని స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది.

ఎంటర్టైన్మెంట్ షోలతో
ఇక శ్రీముఖికి మళ్ళీ ఈటీవీ నుంచి మరొక ఆఫర్ రావడంతో వదులుకోలేదు. పటాస్ చేయడానికి ఒప్పుకుంది. ఆ షో ద్వారా ఆమె యాంకర్ రవితో చేసిన హడావిడి బాగానే క్లిక్ అయింది. దీంతో గ్యాప్ లేకుండా బుల్లితెరపై శ్రీముఖి వరుసగా ఎంటర్టైన్మెంట్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే మరికొన్ని సినిమాలకు అవార్డ్స్ ఈవెంట్స్ కూడా ఆమె హోస్ట్ వ్యవహరిస్తూ వస్తోంది. అందుకు ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది.

గంగుబాయ్ స్టైల్ లో
అయితే శ్రీముఖి ఇటీవల కాలంలో ప్రత్యేకమైన ఫోటోషూట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్లామర్ హైలెట్ అయ్యేలా అలాగే మరొకవైపు డిఫరెంట్ స్టైల్లో క్లిక్ అయ్యేలా అమ్మడు ఫొటో షూట్స్ లో దర్శనమిస్తోంది. ఇక రీసెంట్ గా గంగుబాయి ఖతీయవాడి గెటప్ లో కనిపించి ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కళ్ళజోడు పెట్టుకొని అలియా భట్ ఆ సినిమాలో ఎలా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. ఇక అలాంటి లుక్స్ తో శ్రీముఖి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఫొటోలు వైర
ప్రస్తుతం శ్రీముఖి గంగుబాయి స్టైల్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె కూర్చి మీద కూర్చున్న ఒక ఫోటో అద్భుతంగా ఉంది అని నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. శ్రీముఖి ఇలాంటి పాత్ర దొరికితే మాత్రం తప్పకుండా అద్భుతంగా నటిస్తుంది అని కూడా ఆమె ఫాలోవర్స్ సలహాలు ఇస్తున్నారు. మరి భవిష్యత్తులో శ్రీముఖి ఇలాంటి ప్రయోగాత్మకమైన పాత్రలలో కనిపిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











