Sreemukhi: బాయ్ ఫ్రెండ్, పెళ్లి వార్తలపై శ్రీముఖి షాకింగ్ కామెంట్స్.. పెళ్లి అప్పుడే అంటూ ఫైనల్ క్లారిటీ!

టెలివిజన్ ప్రపంచంలో రోజురోజుకు గ్లామరస్ యాంకర్స్ సంఖ్య మరింతగా పెరుగుతోంది. గతంలో కంటే ఈ మధ్యకాలంలో కొంతమంది యాంకర్లు వారి మాటలతో కంటే అందంతోనే ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు.

ఇక శ్రీముఖికి సంబంధించిన లవ్ రూమర్స్ అలాగే పెళ్లి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరోసారి అలాంటి వార్తలు రావడంతో శ్రీముఖి ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనే విషయంలో కూడా ఆమె ఒక వివరణ ఇచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే..

ఎలాంటి షో చేసినా..

ఎలాంటి షో చేసినా..

బ్యూటిఫుల్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీముఖి ఎలాంటి రియాలిటీ షో చేసినా కూడా అందులో తన మాటలతో హావ భావాలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా గ్లామర్ తో కూడా శ్రీముఖి ఎంతో అందంగా ఓ వర్గం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఎలాంటి షో చేసినా కూడా సక్సెస్ అవ్వాల్సిందే అనే విధంగా శ్రీముఖి తన క్రేజ్ అయితే పెంచుకుంది.

విభిన్నమైన పాత్రలలో..

విభిన్నమైన పాత్రలలో..

శ్రీముఖి మొదట సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లలో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో కనిపించింది. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా సీరియస్ నెగటివ్ రోల్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటించాలని అనుకుంటోంది.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్

సోషల్ మీడియాలో ఫాలోయింగ్

శ్రీముఖి మొదట పటాస్ షో ద్వారా తన క్రేజ్ పెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె దాదాపు అన్ని రకాల టెలివిజన్ ప్లాట్ ఫామ్ లలో తన టాలెంట్ ను బయటపెట్టింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇటీవల కాలంలో శ్రీముఖికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలతో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రేమలో ఉందని..

ప్రేమలో ఉందని..

ఇక శ్రీముఖి రేంజ్ పెరిగిన కొద్ది ఆమెపై అనేక రకాల వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు అయితే చాలాకాలంగా అనిపిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్ల క్రితం శ్రీముఖి ఒక బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉంది అని అలాగే ఒక యువ హీరోతో డేటింగ్ చేస్తుంది అని పలు రకాల కథనాలు వెలుపడ్డాయి. అంతేకాకుండా ఈ ఏడాదిలోని ఆమె పెళ్లి జరగబోతోంది అని కూడా టాక్ వినిపించింది.

మరీ ఇంత దారుణమా?

మరీ ఇంత దారుణమా?

ఇక మొత్తానికి శ్రీముఖి ఇటీవల తన పెళ్లి వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చాలా రోజులుగా నా పెళ్లి గురించి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటారు మరొకసారి మా తండ్రి ఫోటో బ్లర్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. మరీ ఇంత దారుణంగానా? నాకు విసుగొచ్చింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు.. అని నా పెళ్లి ఇంకా ఫిక్స్ కాలేదు అని శ్రీముఖి కాస్త ఘాటుగా వివరణ ఇచ్చింది.

పెళ్లి అప్పుడే..

పెళ్లి అప్పుడే..

ఇక శ్రీముఖి తన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ కూడా కెరీర్ పైనే ఉంది అని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని మరో నాలుగేళ్ల తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అని అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని కూడా శ్రీముఖి ఫైనల్ గా ఒక వివరణ అయితే ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X