For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రదీప్‌కు మరో యాంకర్ లవ్ ప్రపోజల్: నిజంగానే చేయి పట్టుకుని మరీ

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. ఈ రంగంలో గ్లామర్‌కు ప్రాధాన్యం పెరిగిన తరుణంలోనూ తన హవాను చూపిస్తూ వరుస షోలతో దూసుకెళ్తున్నాడు యాంకర్ ప్రదీప్. ఆరంభం నుంచే అద్భుతమైన టైమింగ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే టాప్ యాంకర్‌గా ఎదిగిపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రదీప్‌‌కు ఓ ప్రముఖ షోలో తాజాగా మరో టాప్ యాంకర్ లవ్ ప్రపోజ్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చాటుతోన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు. అందులో చాలా కాలం పాటు పని చేసిన తర్వాత యాంకర్‌గా మారాడు. తొలినాళ్లలోనే మంచి టాలెంట్‌తో పేరు తెచ్చుకున్న అతడు.. ‘గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి పలు ఛానెళ్లలో వరుసగా కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.

  ప్రతీది వన్ మ్యాన్ షోగా మార్చుతూ

  ప్రతీది వన్ మ్యాన్ షోగా మార్చుతూ

  ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా సక్సెస్ అవడానికి అతడి టైమింగే అసలు కారణం అని చెప్పొచ్చు. కమెడియన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా పంచులు వేస్తూ ప్రతి కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. దీంతో మేల్ యాంకర్లలో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతున్నాడతను.

   హీరోగా మారాడు.. హిట్టును కొట్టాడు

  హీరోగా మారాడు.. హిట్టును కొట్టాడు

  సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రదీప్ మాచిరాజు గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో ఇటీలవ హీరోగా మారి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ హిట్ చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

   యాంకర్ ప్రదీప్ బిజీగా... ఇప్పుడివే

  యాంకర్ ప్రదీప్ బిజీగా... ఇప్పుడివే

  చాలా కాలంగా తెలుగులో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్. ఈ క్రమంలోనే మరిన్ని షోలతో దూసుకుపోతూనే ఉన్నాడు. అన్ని ఛానెళ్లలోనూ ఏక కాలంలో పని చేస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ‘ఢీ 13', ‘డ్రామా జూనియర్స్', ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు.

  ప్రదీప్‌కు మరో యాంకర్ లవ్ ప్రపోజ్

  ప్రదీప్ ప్రస్తుతం ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల షోను చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే వారం జరిగే ఎపిసోడ్‌కు మరో యాంకర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అతడిని సర్‌ప్రైజ్ చేస్తూ ముసుగుతో వచ్చిన ఆమె.. ఏకంగా లవ్ ప్రపోజ్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరనేగా మీ సందేహం? ఇంకెవరు తెలుగు స్టార్ యాంకర్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
   అందరి ముందు నిజంగానే.. సిగ్గుతో

  అందరి ముందు నిజంగానే.. సిగ్గుతో


  ‘జగదేకవీరుడు' సినిమాలో దేవకన్యలా ముసుగుతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘మానవా మీరు సిద్దమేనా' అని అడిగింది. దీనికి ప్రదీప్ ‘గత ఐదేళ్లుగా సిద్ధంగా ఉన్నాను' అంటూ బదులిచ్చాడు. దీంతో ముసుగి తీసి ‘నీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా.. ఐ లవ్ యూ' అని అందరి ముందే చెప్పేసింది. దీంతో ప్రదీప్ తెగ సిగ్గు పడిపోయాడు. జడ్జ్‌లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Drama Juniors – The NEXT Superstar Show. Anchor Sreemukhi Came to This Show. Then She Proposed Her Love to Anchor Pradeep.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X