యాంకర్ శ్రీముఖితో బాలీవుడ్ యువ హీరో ముద్దులాట.. ముందుగా అలా కౌగిలింతలు..
తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న శ్రీముఖి ఎలాంటి స్టేజ్ మీద అయినా సరే ప్రేక్షకుల దృష్టిని మొత్తం కూడా తనవైపు తిప్పుకునేలా మాటలతో అందంతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక రీసెంట్ గా సైమా అవార్డ్స్ వేడుకలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలీతో పాటు హోస్టింగ్ గా చేసిన శ్రీముఖి ప్రముఖ సినీ తారలతో ప్రత్యేకంగా మాట్లాడింది. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆమెను కలిసిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఏకంగా ముద్దులు కురిపించడం హైలెట్ గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట అలా కెరీర్ స్టార్ట్
మొదట సినిమా నటిగా తన కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలలో వచ్చిన జులాయి సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో కనిపించిన శ్రీముఖి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా కూడా అవకాశం వచ్చినప్పటికీ మొదట ఆ షోపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అనంతరం పటాస్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చింది.

సైమా అవార్డ్స్ వేడుకలో
ఇక టెలివిజన్ లో రియాలిటీ షోలు స్పెషల్ ఫెస్టివల్ షోలు అంటూ నిత్యం హడావుడిగా కనిపించే శ్రీముఖి అప్పుడప్పుడు గ్రాండ్ ఫిల్మ్ ఈవెంట్స్ లో కూడా యాంకర్ గా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా శ్రీముఖి సైమా అవార్డ్స్ వేడుకలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. ఆమె తో పాటు కమెడియన్ ఆలీ కూడా ఉన్నాడు.

బాలీవుడ్ హీరోతో అలా..
ఇక స్టేజ్ పైన స్టార్స్ ను ఇన్వైట్ చేసే క్రమంలో శ్రీముఖి చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. ఇక విజయ్ దేవరకొండను పంపించగానే అప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ స్టేజ్ పైకి వచ్చాడు. ఇక అతనితో శ్రీముఖి చేసిన హడావిడి బాగా వైరల్ అయింది. అతన్ని ప్రత్యేకంగా కౌగిలించుకున్న శ్రీముఖి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యింది.

ముద్దు పెట్టిన రణ్ వీర్
ఆప్యాయంగా వెస్టర్న్ స్టైల్ లో కౌగిలింతలు ముగిసిన అనంతరం రణ్ వీర్ శ్రీముఖి చేతులకు కూడా ముద్దులు పెట్టాడు. ఇక అతన్ని చూసి శ్రీముఖి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యింది. పక్కనే ఉన్న ఆలీ.. దీపికా పదుకొనె ఇది చూడాలి అంటూ.. సరదగా కామెంట్స్ చేశాడు. ఇక అందుకు సంబంధించిన వీడియోను కూడా శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఐ లవ్యూ అంటూ..
శ్రీముఖికి రణ్ వీర్ అంటే చాలా ఇష్టమైన హీరో అంటూ ఇదివరకే చాలాసార్లు చెప్పింది. ఇక అనుకున్నట్లుగా సైమా అవార్డ్స్ ద్వారా అతన్ని కలవడంతో ప్రత్యేకంగా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఐ లవ్ యూ రణ్ వీర్ సింగ్ అంటూ.. సైమా అవార్డ్స్ ద్వారా సాధ్యమైంది అని అందుకు మరోసారి సైమా ఐ లవ్యూ అంటూ పటాస్ రాములమ్మ సంబరపడిపోయింది. ఇక శ్రీముఖి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. మెగాస్టార్ భోళా శంకర్ లో కూడా ఒక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











