For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sreemukhi Marriage: కోటీశ్వరుడితో శ్రీముఖి పెళ్లి.. ఫ్యామిలీల సీక్రెట్‌ మీటింగ్.. ముహూర్తం అప్పుడే!

  |

  సాధారణంగా సినీ, బుల్లితెర ప్రముఖుల పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగినా ఇట్టే హైలైట్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకులు, డేటింగ్, పెళ్లిళ్లు వంటివి మరింత హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీల మ్యారేజ్ న్యూస్‌లు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఇటీవలి కాలంలోనే ఇలాంటివి ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యాంకర్ శ్రీముఖి పెళ్లి వార్త ఇండస్ట్రీ వర్గాల్లో సెన్సేషన్ అవుతోంది. అలాగే, ఆమె చేసుకునే వ్యక్తి వివరాలు కూడా తెరపైకి వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  అలా వచ్చి... ఫుల్ పాపులర్

  అలా వచ్చి... ఫుల్ పాపులర్

  'జులాయి' అనే సినిమాతో శ్రీముఖి పరిచయం అయింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో లీడ్ రోల్ కూడా చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంది.

  స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

  యాంకర్‌గా రచ్చ.. మూవీల్లో

  యాంకర్‌గా రచ్చ.. మూవీల్లో

  వెండితెరపై సందడి చేస్తోన్నప్పుడే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. దీని తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. ఇలా చాలా కాలంగా టీవీ షోలు చేస్తూ బిగ్ బాస్ తర్వాత నుంచి సినిమాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది.

  చేతి నిండా షోలతో బిజీగా

  చేతి నిండా షోలతో బిజీగా


  యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆఫర్లను దక్కించుకుంటోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె సందడి చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'స్టార్ మా పరివార్' వంటి షోలతో బిజీగా ఉంది.

  జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

  శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్

  శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్

  ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్న యాంకర్ శ్రీముఖి కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. అలాగే ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ముఖ్యంగా ఆమె తోటి యాంకర్‌తో డేటింగ్ చేస్తుందని, ఓ హీరోతో ప్రేమలో ఉందని, ఫలానా బిజినెస్‌మ్యాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

  కోటీశ్వరుడితో శ్రీముఖి పెళ్లి

  కోటీశ్వరుడితో శ్రీముఖి పెళ్లి

  ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆమె ఓ కోటీశ్వరుడైన బిజినెస్‌మ్యాన్‌తో ఏడు అడుగులు నడవబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో అతడు ఎవరా అని అంతా చర్చలు జరుపుతున్నారు.

  హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

  ఫ్యామిలీల సీక్రెట్ మీటింగ్

  ఫ్యామిలీల సీక్రెట్ మీటింగ్

  యాంకర్ శ్రీముఖి పెళ్లి వార్తకు సంబంధించి బయటకు వచ్చిన వివరాల ప్రకారం.. సదరు బిజినెస్‌మ్యాన్‌తో ఆమె సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగిస్తోందట. అంతేకాదు, ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసని తెలిసింది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఈ రెండు ఫ్యామిలీల పెద్దలు సీక్రెట్‌గా సమావేశం అయ్యారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

  పెళ్లి జరిగేది ఎప్పుడంటే!

  పెళ్లి జరిగేది ఎప్పుడంటే!

  సుదీర్ఘ కాలంగా బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న యాంకర్ శ్రీముఖి.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతుందని కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరికొన్ని రోజుల్లోనే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ చేయాలని పెద్దలన నిర్ణయించుకున్నారని తెలిసింది. అలాగే, ఈ సంవత్సరం వేసవిలో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని అంటున్నారు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది.

  English summary
  Actress, Anchor Sreemukhi Doing Many Projects At a Time. Now Her Marriage News Gone Hot Topic in Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X