మోనాల్‌ని పబ్లిక్‌గా అక్కడ తాకిన శ్రీముఖి.. మమ్మల్ని చేయనివ్వరంటూ బావ ముందే ఘోరంగా!

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కెరీర్ స్టార్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల తర్వాత యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి పటాస్ ద్వారా యమ క్రేజ్ సాధించుకుంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ ప్రస్తుతం స్టార్ యాంకర్ లో ఒకరిగా పాపులర్ అయింది. ఇప్పటికీ అదే కంటిన్యూ చేసే శ్రీముఖి తాజాగా బిగ్ బాస్ ఫేమ్, హీరోయిన్ మోనాల్ గజ్జర్ ను చెప్పరాని చోట తాకి హల్ చల్ చేసింది.

హీరోలకు చెల్లెలిగా : 2012లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ భామ శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో నటించిన ఈ బొద్దుగుమ్మ ఇందులోనూ హీరోకు సోదరిగా నటించి ఆకట్టుకుంది.

 Sreemukhi Monal Gajjar

అదుర్స్ అంటూ : మొదట్లో హీరోలకు చెల్లెలిగా నటించిన గ్లామరస్ బ్యూటి శ్రీముఖి తర్వాత పలు కీలక పాత్రలు పోషించింది. ఇందులో భాగంగానే 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి తెగ పాపులర్ అయింది. ఇక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది.

బీబీ జోడీకి : అదుర్స్ ద్వారా యాంకర్ అయిన శ్రీముఖి అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసి మంచి రు తెచ్చుకుంది. ఇటీవలే బీబీ జోడీకి హోస్ట్ గా వ్యవహరించింది.

 Sreemukhi Monal Gajjar

నడుము సీన్ : ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ శ్రీముఖి. మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ మూవీలో శ్రీముఖి నటించనుందని టాక్. అందులోనూ ఈ మూవీలో పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాలోని నడుము సన్నివేశాన్ని చిరు, శ్రీముఖి మధ్య తెరకెక్కించనున్నట్లు గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలా షోలు, సినిమాలు చేస్తున్న ఈ బ్యూటి తాజాగా ఓ కొంటే పని చేసింది.

లెగ్స్ అందాలతో : యాంకర్ శ్రీముఖు, బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఇద్దరు కలిసి ఓంకార్ సిక్త్స్ సెన్స్ 5వ సీజన్ లో పాల్గొన్నారు. ఈ షోలో శ్రీముఖి అతి చిన్న స్కర్ట్ వేసుకుని తన లెగ్స్ అందాలతో అట్రాక్ట్ చేసింది. భూమ్ బద్దలు పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత మాకేమో మొత్తం కవర్ చేసుకోని రమ్మని.. కొందరేమో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తారు అని ఓంకార్ ఛాతిపై చేయి వేసి శ్రీముఖి అంది. బావగారూ.. ఊ..ఊ.. అని ఓంకార్ తో తనదైన స్టైల్ తో అంటూ ఇన్ డైరెక్ట్ గా తమను ఎక్స్ పోజింగ్ చేయనివ్వరూ అని చెప్పింది.

 Sreemukhi Monal Gajjar

సిగ్గుతో కళ్లు మూసుకుని..: తర్వాత మోనాల్ గజ్జర్ చుట్టూ తిరుగుతూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. నీయవ్వ తగ్గేదేలే అంటూ మోనాల్ ను చెప్పరాని చోట కొట్టింది. దీంతో మోనాల్ ఒక్కసారిగా షాక్ అయి సిగ్గుతో కళ్లు మూసుకుంది. శ్రీముఖి, యాంకర్ ఓంకార్ మాత్రం నవ్వుతూ ఉన్నారు. ఇలా పబ్లిక్ అందరూ చూసే షోలో మోనాల్ ను శ్రీముఖి అలా కొట్టే సిక్స్ సెన్స్ 5 సీజన్ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X