శ్రీముఖి కొత్త వ్యాపారం.. భారీ పెట్టుబడితో మీ సహాయం లేకుంటే సాధ్యం కాదు అంటూ..

గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న యాంకర్ శ్రీముఖి. కేవలం వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ అనే కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ షోలతో కూడా తన స్థాయిని పెంచుకున్న ఈ బ్యూటీ రోజురోజుకు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత శ్రీముఖి అందరికి ఒక సరికొత్త న్యూస్ చెప్పింది. ఆమె కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లు అప్డేట్ ఇచ్చింది.

గట్టిగానే పోటీని ఇస్తోంది..

గట్టిగానే పోటీని ఇస్తోంది..

తెలుగు బుల్లితెరపై మిగతా యాంకర్స్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ అమ్మడు తన రేంజ్ కు తగ్గట్లు పోటీని ఇస్తోంది. అనసూయ, రష్మీ లాంటి వాళ్ళు కేవలం మినీ స్క్రీన్ పైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా వారి సత్తా చూపిస్తున్నారు. ఇక శ్రీముఖి కూడా అదే తరహాలో నడుస్తోంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోస్ తో డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది.

 హాట్ ఫొటోస్ తో గుడ్ న్యూస్..

హాట్ ఫొటోస్ తో గుడ్ న్యూస్..

ఇటీవల శ్రీముఖి గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ ఫోటోలను మొదట చూడగానే ఒక్క సెకండ్ వరకు ఆమె డ్రెస్ కాకుండా న్యూస్ పేపర్ తో అందాలని కవర్ చేసిందా అని అంతా అనుకున్నారు. న్యూస్ పేపర్ లాంటి డిజైన్ లో డ్రెస్ రెడీ చేసుకున్న శ్రీముఖి సరికొత్తగా ఆకట్టుకుంది.

శ్రీముఖి ఈ ఫొటోలను రిలీజ్ చేయడమే కాకుండా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు మొన్న ఒక ట్వీట్ చేసింది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక గ్రేట్ న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతున్నాను అంటూ వినూత్నంగా ఫొటో షూట్ తో హీటెక్కించేంది శ్రీ ముఖి.

భారీ పెట్టుబడితో శ్రీముఖి కొత్త వ్యాపారం

భారీ పెట్టుబడితో శ్రీముఖి కొత్త వ్యాపారం

ఏమైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతుందా అనే రూమర్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ అమ్మడు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. ప్రస్తుతం చాలా మంది స్టార్స్ ఫ్యాషన్ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్టార్స్ కొత్త తరహా డ్రెస్సులను మార్కెట్ లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీముఖి కూడాభారీ పెట్టుబడితో అమ్మాయిలకు నచ్చేలా కొత్త బ్రాండ్స్ ను మార్కెట్ లోకి తేనుందట.

మీ ప్రేమ కావాలి..

మీ ప్రేమ కావాలి..

నిజమే నేను పూర్తిగా కొత్త జోన్లోకి అడుగుపెడుతున్నాను. మీరు నన్ను హోస్ట్‌గా, యాంకర్‌గా మరియు ఆర్టిస్ట్‌గా ప్రేమించారు. ఇప్పుడు, మీరు నా స్వంత వ్యాపార విషయాలతో వ్యవహరించే మహిళలుగా నన్ను స్వీకరిస్తారని అనుకుంటున్నా. "LUVIH" luvih.store ing ను ప్రారంభిస్తున్నాను అని తెలిపిన శ్రీముఖి.. మార్కెట్లోకి నా కొత్త బ్రాండ్. "LUVIH" రానుందని LUV ఉన్నందున, ఈ అంశంలో కూడా మీ నుండి ప్రేమను ఆశిస్తున్నానని వివరించింది.

Recommended Video

Mahesh Babu Ss Rajamouli Movie Genre Revealed | బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ..!!
మీ సహాయం లేకుండా సాధ్యం కాదు

మీ సహాయం లేకుండా సాధ్యం కాదు

నా కొత్త ప్రయాణానికి మీ శుభాకాంక్షలు నాకు అవసరం. ఈ బిజినెస్ లో సహాయం చేస్తున్న "తిరుపతి గారు మరియు శ్రీకాంత్ గారు" ప్రత్యేక ధన్యవాదాలు! మీ సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు.. అని కూడా శ్రీముఖి వివరణ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉకో కాకా అనే క్లాత్ స్టార్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X