శ్రీముఖి, రవి రొమాన్స్, కెమిస్ట్రీ అదిరింది.. దుమ్ము రేపారు..
బుల్లితెర మీద యాంకర్లు శ్రీముఖి, రవి హంగామా అంతా ఇంతా కాదు. వారిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉంది. యాంకర్ లాస్యతో విడిపోయిన రవి, ఆ తర్వాత శ్రీముఖితో జతకట్టి దుమ్ము రేపుతున్నాడు.
Recommended Video

బుల్లితెర మీద యాంకర్లు శ్రీముఖి, రవి హంగామా అంతా ఇంతా కాదు. వారిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉంది. యాంకర్ లాస్యతో విడిపోయిన రవి, ఆ తర్వాత శ్రీముఖితో జతకట్టి దుమ్ము రేపుతున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అది మీరే చూడండి..

అఫైర్ ఉందంటూ గాసిప్స్
ఇటీవల కాలంలో శ్రీముఖి, రవి మధ్య ఏదో అఫైర్ ఉంది అనే ఆరోపణలు బాగానే వస్తున్నాయి. కానీ వాటిని వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా కలిసి పనిచేసేటప్పుడు మా మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉంటాయి. అదేమీ తప్పుకాదు అని శ్రీముఖి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

డేటింగ్ చేస్తే తప్పేమిటీ?
మేమిద్దరం డేటింగ్ చేస్తే తప్పేమిటీ? రెండు సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. చాలా రోజులుగా పరిచయం ఉంది. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్రశాంతత కోసం రెగ్యులర్‌గా బయట కలుసుకొంటున్నాం అని శ్రీముఖి చెప్పారు.
దుమ్ము రేపుతున్న డ్యాన్స్ వీడియో
అలాంటి రిలేషన్ ఉన్న శ్రీముఖి, రవిలు కలిసి ప్రాక్టీస్ చేస్తున్న డ్యాన్స్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొంటున్నది. ఈ వీడియోను శ్రీముఖి తన యూట్యూబ్ చానెల్‌తో పోస్ట్ చేశారు.

స్పైడర్ పాటకు స్టెప్పులు
స్పైడర్ చిత్రంలోని పుచ్చకాయ.. పుచ్చకాయ పాటకు లయబద్దంగా నృత్యం చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా కనిపించింది. డాన్స్ మాస్టర్లు చేస్తున్న విధంగానే తన్మయత్మంతో డ్యాన్స్ చేస్తూ అలరించారు.


Click it and Unblock the Notifications











