For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి: మేటర్ లీక్ చేసిన కమెడియన్.. ఏకంగా పెళ్లి కొడుకుతో కలిసి రచ్చ

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకుంటూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. సినిమా నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి తన సత్తాను నిరూపించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మందికి క్రష్‌గా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అనేసింది. ఆ సంగతులు మీకోసం!

  ఆ హీరోకు సోదరిగా పరిచయమైంది

  ఆ హీరోకు సోదరిగా పరిచయమైంది

  ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి.. ముందుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి'తో శ్రీముఖి నటిగా పరిచయం అయింది. ఇందులో హీరో చెల్లెలిగా నటించింది. దీని తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్', ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.

  అదుర్స్ అంటూ వచ్చి అదరగొట్టింది

  అదుర్స్ అంటూ వచ్చి అదరగొట్టింది

  సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బుల్లితెరపై యాంకర్‌గా పని చేసే అవకాశాన్ని అందుకుంది శ్రీముఖి. ఈ క్రమంలోనే ‘అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలను విజయవంతంగా నడిపించింది. వాటిలో ‘పటాస్' ఆమె కెరీర్‌ను మార్చేసింది.

  గెలవకున్నా... బాగా ప్లస్ అయింది

  గెలవకున్నా... బాగా ప్లస్ అయింది

  వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. అద్భుతమైన ఆటతీరుపై ఫినాలేకు చేరుకుంది. కానీ, చివరి మెట్లుపై బోల్తా పడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, దీని తర్వాత శ్రీముఖికి క్రేజ్ రెట్టింపు అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

  ఇప్పుడలా ఫుల్ బిజీ అయిన భామ

  ఇప్పుడలా ఫుల్ బిజీ అయిన భామ

  రియాలిటీ షో తర్వాత శ్రీముఖి కెరీర్‌కు బూస్టు వచ్చింది. దీంతో ఆమె బిజీ యాంకర్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా సినిమా ఫంక్షన్ల‌తో పాటు ఇంటర్వ్యూలు చేస్తోంది. అలాగే లూవీ అనే బిజినెస్‌ను ప్రారంభించింది. అంతేకాదు, ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో'లోనూ నటిస్తోందీ బ్యూటీ.

  ఎప్పుడూ అందులోనే.. యమ క్రేజ్

  ఎప్పుడూ అందులోనే.. యమ క్రేజ్

  శ్రీముఖి వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందీ భామ.

  అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి

  అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి

  జీ తెలుగు చానెల్‌ 16 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ‘జీ మహోత్సవం' అనే ఈవెంట్ ప్రసారం కానుంది. దీనికి శ్రీముఖి హోస్టుగా వ్యవహరించింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖికి అమెరికా అబ్బాయితో పెళ్లి జరగబోతున్నట్లు చూపించారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

  ఏకంగా పెళ్లి కొడుకుతో కలిసి రచ్చ

  ఏకంగా పెళ్లి కొడుకుతో కలిసి రచ్చ

  ఓ స్కిట్‌లో భాగంగా గల్లీ బాయ్స్ సద్దాం హుస్సేన్ టీమ్ శ్రీముఖికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. ఇందుకోసం వాళ్లంతా కలిసి అమెరికా పాప్ సింగర్ అంటూ ఓ కుర్రాడిని తీసుకొస్తారు. అతడితో ఆమెకు పెళ్లి జరిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే మంచి ఫన్ క్రియేట్ అయింది. అతడితో కలిసి సద్దాం గ్యాంగ్ చేసిన రచ్చ హైలైట్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం దీనిపై లుక్కేయండి.

  Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
  గుంజుతున్నడేందిరా అంటూ శ్రీముఖి

  గుంజుతున్నడేందిరా అంటూ శ్రీముఖి

  ఇక, ఈ స్కిట్‌లో శ్రీముఖి.. అమెరికా అబ్బాయి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవడం.. సద్దాం పేరడీ సాంగ్స్ పాడడం నవ్వు తెప్పిస్తుంది. ఇక, చివర్లో రాములమ్మ లేచి వచ్చేస్తుంటే ఆ అబ్బాయి ఆమెను పట్టుకుని లాగుతాడు. అప్పుడు శ్రీముఖి.. ‘వీడేంట్రా గుంజుతున్నడు నాకు అర్థమైతలేదు. నిజంగానే పెళ్లాం అనుకుంటున్నాడా ఏంది' అంటూ మరింత ఫన్ పుట్టించింది.

  English summary
  Anchor Sreemukhi Ready to Marry American Pop Singer for Zee Mahotsavam 2021 16th Anniversary Mega Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X