మీరంతా నా బావలే అంటున్న శ్రీముఖి: పెళ్లిపై, బిగ్ బాస్ షో ఎంట్రీపై స్పందన!
Recommended Video
తెలుగులో యూత్ బాగా మెచ్చిన, పాపులర్ అయిన షోలలో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న 'పటాస్'లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకోవడంతో షో గ్లామర్ తగ్గిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. కారణమేంటో చెప్పలేదు కానీ ఈ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల శ్రీముఖి ప్రకటించారు.
శ్రీముఖి ఈ షో నుంచి తప్పుకోవడానికి కారణం త్వరలో బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వబోతుండటమే అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయమై తనకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి చాలా ప్రశ్నలు వస్తుండటంతో శ్రీముఖి స్పందించారు.

సమయం వచ్చినపుడు మీకే తెలుస్తుంది
‘‘చాలా మంది నన్ను ఈ మధ్య కాలంలో ఈ ప్రశ్న అడుగుతున్నారు. నేను బిగ్ బాస్ షోకు వెళుతున్నానా? లేదా? అనేది సమయం వచ్చినపుడు మీకే తెలుస్తుంది. జనాలు రకరకాలుగా రాస్తారు, రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఏదో ఒక రోజు మీకు అసలు నిజం తెలుస్తుంది.'' అంటూ అభిమానులను మరింత ఉత్కంఠలో పడేశారు శ్రీముఖి.

మీరంతా నాకు బావలే...
నాకు వరుసయ్యే బావలు ఎవరూ లేరు. చాలా సందర్భాల్లో నేను ఈవెంట్లకు వెళ్లినపుడు ఇక్కడున్న వాళ్లందరూ నా బావలే అని అనేస్తుంటాను కాబట్టి చాలా మంది నాకు ఎవరైనా బావ ఉన్నారేమో అని అనుకుంటున్నారు. కానీ అలాంటి వారు ఎవరూ లేరని ఓ అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు శ్రీముఖి సమాధానం ఇచ్చారు.

పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెబుతాను
శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకోవడానికి పెళ్లి కుదరడమే కారణం అనే మరో రూమర్ కూడా ప్రచారంలో ఉంది. అలాంటిదేమీ లేదని శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. పెళ్లి ఫిక్సయితే కచ్చితంగా ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల ద్వారా మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తానని తెలిపారు.

నా ట్రేడ్ మార్క్ రాములమ్మ నవ్వు మిస్సవుతున్నారా?
నేను పటాస్ షోలో కనిపించక పోవడం వల్ల మీరు నా ట్రేడ్ మార్క్ రాములమ్మ నవ్వు మిస్సవుతారు అనుకుంటున్నాను. ఎప్పుడూ పటాస్ కార్యక్రమం షూట్ చేసినా.. సెట్స్‌కు వెళ్లిన మాటల్లో చెప్పలేని ఎనర్జీ ఉంటుంది. స్టూడెంట్స్ అల్లరి నచ్చతుంది. ఐ లవ్ ది దట్ ఎనర్జీ. అలాంటి షో నుంచి నేను బ్రేక్ తీసుకొంటున్నాను. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి అనుమతి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నాను అని శ్రీముఖి వెల్లడించింది.


Click it and Unblock the Notifications











