నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది: గుర్తు చేసుకుని సిగ్గు పడిన శ్రీముఖి

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ మార్కు చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో మేల్ యాంకర్ల కంటే ఫీమేల్ యాంకర్ల హవానే ఎక్కువ. అందులోనూ కొందరు మాత్రమే తమదైన శైలితో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి పేరును ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. సినిమాలతో కెరీర్‌ను ఆరంభించిన ఆమె... టీవీ రంగంలోకి ప్రవేశించింది. ఇలా అడుగెట్టిందో లేదో తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి జీవితంలో జరిగిన ఊహించని సంఘటన బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు

తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు

శ్రీముఖి మొదట సినిమాలతోనే కెరీర్‌ను ప్రారంభించింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి' ఆమె మొదటి చిత్రం. దాని తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'లో నటించింది. ఆ వెంటనే ‘ప్రేమ ఇష్క్ కాదల్'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. దీంతో బ్రేక్ రానప్పటికీ వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘నేను శైలజ', ‘జెంటిల్‌మన్' వంటి చిత్రాల్లో నటించింది.

అక్కడ మాత్రం శ్రీముఖికి తిరుగులేదు

అక్కడ మాత్రం శ్రీముఖికి తిరుగులేదు

సినిమాల్లో భారీ బ్రేక్ రాకపోయినప్పటికీ... టీవీ రంగంలో మాత్రం ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ‘పటాస్' అనే షో వల్ల ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చింది. అదే సమయంలో చాలా షోల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో భాగంగానే ‘మనీ మనీ', ‘సూపర్ సింగర్ 9', ‘జూలకటక', ‘సూపర్ మామ్', ‘సరిగమప' సహా ఎన్నో షోలు చేసింది.

వివాదాల్లో శ్రీముఖి.. భయపడలేదుగా

వివాదాల్లో శ్రీముఖి.. భయపడలేదుగా

శ్రీముఖికి ఎంత మంది అభిమానులు ఉన్నారో.. అంతే సంఖ్యలో విమర్శించే వాళ్లూ ఉన్నారు. దీనికి కారణం ఆమె వ్యవహారశైలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పటాస్' అనే షోలో యాంకర్ రవితో కలిసి ఆమె వ్యవహరించిన తీరు అప్పట్లో వివాదాస్పదం అయింది. అదీకాక ఆమె ఇచ్చిన కొన్ని స్టేట్‌మెంట్లు విమర్శలకు కారణం అయ్యాయి. కానీ, రాములమ్మ మాత్రం అస్సలు భయపడలేదు.

ఆ సీన్స్ చేయలేక సినిమాలకు దూరమైంది

ఆ సీన్స్ చేయలేక సినిమాలకు దూరమైంది

టీవీ షోలతో బిజీగా గడుపుతున్నప్పటికీ.. శ్రీముఖి సినిమా ఆఫర్లు రాకుండా లేవు. ఆమెను ఎంతో దర్శకులు, నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని అడిగారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, చాలా మంది రొమాంటిక్ సీన్స్, గ్లామరస్ పాత్రలు చేయాలని అడిగారని, అలాంటి చేయడం ఇష్టం లేకనే సినిమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... శాడ్ ఎండింగ్‌తో ఢీలా

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... శాడ్ ఎండింగ్‌తో ఢీలా

బుల్లితెరపై తిరుగులేదని యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతున్న సమయంలోనే శ్రీముఖికి ‘బిగ్ బాస్' సీజన్ -3లోకి అవకాశం వచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ట్రోఫీని అందుకునేది రాములమ్మే అనే ప్రచారం జరిగింది. కానీ, ఫైనల్‌లో ఆమెకంటే రాహుల్ సిప్లీగంజ్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో రన్నరప్‌గా నిలిచింది.

ఆ సంఘటన గుర్తు చేసుకున్న శ్రీముఖి

ఆ సంఘటన గుర్తు చేసుకున్న శ్రీముఖి

శ్రీముఖి, ఆమె స్నేహితులకు టూర్స్ వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఆ విషయం రాములమ్మను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు. ఆ టూర్ వల్లే తన పరువు పోయిందని ఇటీవల శ్రీముఖి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే, తన జీవితంలో జరిగిన చాలా విషయాలతో పాటు చేదు జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంది.

Recommended Video

Indian Film Industry, Theaters and Multiplexes in Financial Turmoil
నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది

నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది

చేదు జ్ఞాపకం గురించి మాట్లాడుతూ.. ‘మేము ముంబై టూర్‌లో ఉన్నప్పుడు.. మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరన్న ఉద్దేశ్యంతో బాగా తిరిగేశాము. ఓ సారి షాపింగ్ చేసి వస్తూ బిచ్చగాళ్లలా రెండు చేతుల్లో సంచులు పట్టుకుని నడుస్తున్నాం. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి మీరు శ్రీముఖి కదా అని అన్నాడు. దీంతో నా పరువు మొత్తం పోయింది' అంటూ సిగ్గు పడిపోయిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X