Anchor Sreemukhi: నా ఫస్ట్ లవ్ కోసమే సినిమాలు చేయట్లేదు.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీముఖి

అద్భుతమైన అందాలు కల్గిన అచ్చమైన తెలుగు యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు టీవీలో అనేక షోలు చేస్తూ తెగ సందడి చేసే ఈమె సినిమాలు కూడా చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే గతేడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు.

అయితే వరుసగా టీవీ షోలు చేసే ఈ క్యూట్ బ్యూటీ.. సినిమాలు మాత్రం ఎక్కువగా చేయట్లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని ముఖ్యంగా తన ఫస్ట్ లవ్ కోసమే సినిమాలు తక్కువగా చేస్తున్నానని వివరించింది. అందుకే ఎక్కువగా టీవీ షోలపై ఫోకస్ చేసినట్లు వివరించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anchor Sreemukhi Reveal Reasons Behind Why She is Not Doing More Films Check Details

పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోలు చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లోకి కూడా వచ్చింది. కానీ బుల్లితెరపై తెచ్చుకున్నంత గుర్తింపును మాత్రం సిల్వర్ స్క్రీన్ పై రాబట్టుకోలేక పోయింది. ముఖ్యంగా 2012లో జులాయి సినిమాతో తన సినీ కెరియర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారి కొన్ని చిన్న చిత్రాల్లో మెరిసింది.

అయితే ఈమె అందం, అభినయానికి ఆఫర్లు బాగానే వచ్చినా టీవీ షోలు చేస్తుండడంతో ఎక్కువగా పెద్ద చిత్రాల్లో ఛాన్స్ రాలేదు. అయినా సరే తన పని తాను చేసుకుంటూ వస్తోంది. అయితే ప్రస్తుతం సూపర్ సింగర్ షోకి యాంకర్ గా చేస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి గల కారణాలను వివరించింది.

Anchor Sreemukhi Reveal Reasons Behind Why She is Not Doing More Films Check Details

సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు చాలా సమయం పడుతుందని.. అందుకోసం ఎక్కువగా డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీముఖి వివరించింది. అయితే తాను చేస్తున్న షోల కారణంగా తనకు ఎక్కువ సమయం దొరకదని.. కనీసం యూఎస్ వెళ్లి ఈవెంట్ చేసుకోవడానికి కూడా వీళ్లు సమయం ఇవ్వరంటూ వివరించింది. తన ఫస్ట్ లవ్ టీవీలే కాబట్టి తాను ఎక్కువగా టీవీ షోలు చేస్తున్నట్లు వివరించింది. అలాగే సినిమాలు చేయాలని ఉన్నా.. ఎక్కువ మాత్రం టీవీ షోలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించింది.

అలాగే తాను మాటీవీలో అనేక షోలు చేయబోతున్నట్లు వివరించింది. సూపర్ సింగర్ షో తర్వాత అనేక అద్భుతమైన షోలను ప్రసారం చేసేందుకు మాటీవీ సిద్ధం అయిందని యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వతా నుంచి టీవీల క్రేజ్ తగ్గిపోయిందని.. వాటిని పెంచడానికి సరికొత్త కాన్సెప్ట్ లతో రాబోతున్నట్లు స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X