For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  |

  చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో దాదాపు ఐదారేళ్లుగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది హాట్ బ్యూటీ శ్రీముఖి. హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ భామ.. ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి మంచి పాత్రలు చేసిన తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వెనుదిగిరి చూడని ఈ తెలుగమ్మాయి.. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి టీవీ షోలు, సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Recommended Video

  #HBDSreemukhi: It's Time To Party First Look Out | Filmibeat Telugu
   అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఫేమస్ అయింది

  అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఫేమస్ అయింది

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'జులాయి' సినిమాతో నటిగా పరిచయమైంది లోకల్ బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించిన ఈ బ్యూటీ.. చక్కని గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే 'అదుర్స్' అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అద్భుతమైన యాంకరింగ్‌తో అలరిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఫలితంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోందీ బ్యూటీ. అదే సమయంలో బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోయింది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  బిగ్ బాస్ తర్వాత మారింది... రచ్చ చేస్తుంది

  బిగ్ బాస్ తర్వాత మారింది... రచ్చ చేస్తుంది

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా టీవీ షోలు, సినిమాల అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయిన శ్రీముఖి.. కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. ఇక, ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో సినిమాలు చేయనన్న ఆమె.. ఆ తర్వాత పంథాను మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ దూసుకెళ్తోంది.

   కెరీర్ పరంగా సక్సెస్.. వ్యవహార శైలితో అలా

  కెరీర్ పరంగా సక్సెస్.. వ్యవహార శైలితో అలా

  ఏమాత్రం అంచనాలు లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సినిమాలు, కార్యక్రమాలు, మూవీ ఫంక్షన్‌లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో రకాలుగా బిజీగా ఉంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది యాంకర్ శ్రీముఖి. అయితే, పర్సనల్‌గా మాత్రం ఆమె ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. గతంలో 'పటాస్' షోలో యాంకర్ రవితో కలిసి వ్యవహరించిన తీరుతో విమర్శల పాలైన ఆమె.. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు, రొమాన్స్‌తో రెచ్చిపోతోంది.

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్

  అందులో ఎప్పుడూ బిజీగా ఉంటు సందడిగా

  అందులో ఎప్పుడూ బిజీగా ఉంటు సందడిగా

  చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి మాత్రం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అప్పుడప్పుడూ ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే హాట్ హాట్ పిక్స్‌ను షేర్ చేస్తోంది. తద్వారా గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసేస్తుంది.

  అంకుల్స్‌తో కలిసి శ్రీముఖి రచ్చ.. ఫుల్ బిజీ

  అంకుల్స్‌తో కలిసి శ్రీముఖి రచ్చ.. ఫుల్ బిజీ

  కెరీర్ ఆరంభంలో శ్రీముఖి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. అయితే, ఆ తర్వాత ఈ బ్యూటీ పెద్దగా సినిమాల్లో నటించలేదు. తనకు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని, అందుకే మూవీలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చిందామె. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఈ సత్తిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణిలు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది ఆగస్టు 19న విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది శ్రీముఖి.

  Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్‌ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు

  ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చానంటూ

  ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చానంటూ

  'క్రేజీ అంకుల్స్' మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా శ్రీముఖి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించింది. 'యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించేది. అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని ఏడ్చేసేదాన్ని. అంతేకాదు, మా నాన్నకు కూడా ఈ విషయం చెప్పాను. కానీ, ఆయన ''నువ్వు ఫేమస్ అవ్వాలి కదా.. పెద్ద యాంకర్‌గా మారాలి కదా. అలా జరగాలంటే కొంత కష్టపడాలి'' నాకు సర్ధి చెప్పేవారు. అప్పుడు నన్ను నేను మార్చుకున్నా' అని వెల్లడిచిందామె.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. అంతా

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. అంతా

  షూటింగ్‌లో ఎదురయ్యే కష్టాలను గురించి శ్రీముఖి వివరిస్తూ.. 'షూటింగ్ చేసే సమయంలో చాలా సేపు నిల్చుని ఉండాల్సి వచ్చేది. కొన్ని షోలలో నాతో ఎక్కువగా నిల్చుని ఉండేలా చేయించారు. దీంతో నా కాళ్లు తిమ్మిర్లు వచ్చేసేవి. ఇలాంటి సంఘటనలు నా కెరీర్‌లో ఎన్నో జరిగాయి. అప్పుడే ఇదంతా మనకు అవసరమా అని అనిపించింది. నాకే కాదు.. యాంకరింగ్ చేసే ప్రతి ఒక్కరికీ ఇలాంటి కష్టం ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చేసే షోలలో అయితే జడ్జ్‌లు అందరూ మాట్లాడే వరకూ నిల్చునే ఉండాలి. అలా చాలా మంది బాధ పడుతున్నారు' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Recently Participated in An Interview. In This Chit Chat She Revealed her Shooting and Personal Problems.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X