‘16 ఏళ్ల వయసులో దానికి బానిసనయ్యా ... రెండు సార్లు కావాల్సిందే’
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. అందం, చలాకీతనం, సమయస్పూర్తితో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అద్భుతంగా హోస్ట్ చేయగలరు. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్స్, ఇంటర్వ్యూల వరకు సుమ కనకాల టాప్‌లో ఉంటే.. టీవీ వరకు శ్రీముఖి దరిదాపుల్లో ఎవరూ లేరు. రియాలిటీ షోలు, కామెడీ షోలు ఇలా ఏదైనా సరే అలవోకగా నడిపించగలదని శ్రీముఖికి పేరొచ్చింది. మనిషి అన్నాక ఎవరికైనా బలహీనతలు సహజం.. అలాగే శ్రీముఖి కూడా ఓ వీక్‌నెస్ ఉందట. ఈ వివరాల్లోకి వెళితే..
స్టార్ మాలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం సరికొత్త థీమ్‌తో బుల్లితెర సెలబ్రిటీలతో రాములమ్మ సందడికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం కొత్తగా ముస్తాబైంది. ఈ వారం కిట్టి పార్టీ థీమ్‌తో బుల్లితెరకు చెందిన మహిళా నటులు సందడి చేశారు. సుహాసినీ, శోభా శెట్టి, ప్రిన్సీ, ఐశ్వర్య పిస్సే, సుజిత, అర్చన అనంత్, భావన, సంజనా గల్రానీ, నేత్ర తదితరులు ఈ వారం పాల్గొన్నారు. ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది.

16 ఏళ్ల వయసులో మీరేం చేశారంటూ సుజిత దగ్గరికి వెళ్లి అడిగింది శ్రీముఖి. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి.. తన చేతిపై నా పేరు రాసుకున్నాడు. అది నేను చూడగానే షాకయ్యా.. ఎందుకంటే నా పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ కనిపించింది. అందుకే రిజెక్ట్ చేసేశానని చెప్పింది. ఇంతలో అమ్మగారు.. మీరు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారని ఎక్స్‌ప్రెస్ హరి అడగ్గా.. మా మమ్మీ ఇంకొక బిర్యానీ కోసం వెయిట్ చేసేదానిని, ఎప్పుడు తెస్తదా అని అంటూ శ్రీముఖి ఆన్సర్ ఇవ్వడంతో అంతా నవ్వేశారు.
నిజానికి తనకు బిర్యానీ అంటే పిచ్చి అని అది లేకుండా ఉండలేనని శ్రీముఖి పలుమార్లు తెలిపింది కూడా. ఇదే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో శ్రీముఖి ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో బొద్దుగా, ముద్దుగా గుర్తుపట్టలేని విధంగా ఉన్న శ్రీముఖి ఫోటోలు చూసి అంతా షాక్ అయ్యారు. దీని గురించి స్వయంగా రాములమ్మ క్లారిటీ ఇచ్చారు... ఇవి నా 10వ తరగతి నాటి ఫోటోలని.. అప్పట్లో బిర్యానీ అంటే నాకు పిచ్చి, ఒక్కసారి కూర్చొంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్స్ ఖాళీ చేసేయాల్సిందే. అలా ఏకధాటిగా తిని తిని ఏకంగా 108 కిలోలు పెరిగిపోయానని శ్రీముఖి వెల్లడించారు. అంత లావుగా ఉన్న నేను.. ఇలా స్లిమ్‌గా మారడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు శ్రీముఖి.
అంతేకాదు.. వంట చేసి, ఇష్టమైన వారికి పెట్టడం శ్రీముఖికి అలవాటు. వీలున్నప్పుడల్లా రకరకాల బిర్యానీలు ట్రై చేస్తూ తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు వండి పెడతారు శ్రీముఖి. ఈ బిర్యానీ పిచ్చి కారణంగానే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు ఈ స్టార్ యాంకర్. హైదరాబాద్ మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్‌లో ఫుర్సత్ రెస్టారెంట్‌ను ఇటీవల ప్రారంభించారు శ్రీముఖి. తన మిత్రులు శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి ఈ రెస్టారెంట్ రంగంలోకి దిగినట్లు ఆమె తెలిపారు. చికెన్ బిర్యానీ, ఇంటీ కర్రీలు తనకు చాలా ఇష్టమని.. ఆహార ప్రియులకు కావాల్సిన అన్ని రకాల వెరైటీలు ఈ రెస్టారెంట్‌లో ఉన్నాయని శ్రీముఖి చెప్పారు.


Click it and Unblock the Notifications


