జ్యోతక్క నిజ స్వరూపం ఇదే... ఆధారాలతో బయటపెట్టిన స్టార్ యాంకర్
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి సెలబ్రిటీగా మారిపోయింది జ్యోతక్క అలియాస్ శివజ్యోతి. తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్‌లో సావిత్రిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన శివజ్యోతి తాజాగా వివాదంలో చిక్కుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిలబడి, తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను సాంప్రదాయవాదులు, శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. దాంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పింది. దీంతో తెలుగు మీడియాలో ఆమె పేరు మారుమాగుతోంది.
న్యూస్ రీడర్ నుంచి సెలబ్రిటీగా
ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ అనే కార్యక్రమంలో బిత్తిరి సత్తితో కలిసి శివజ్యోతి చేసిన అల్లరి జనాల్లోకి బాగా వెళ్లింది. ఆమె తెలంగాణ యాస, పంచ్‌లు, కట్టుబొట్టుకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తీన్మార్ మాదిరిగానే పలు ఛానెల్స్ కార్యక్రమాలు ప్రసారమైనప్పటికీ ఈ స్థాయిలో అలరించలేకపోయింది. తీన్మార్‌తో పాపులారిటీ తెచ్చుకున్న శివజ్యోతికి బిగ్‌బాస్ తెలుగు 3లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అయితే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేక ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులారిటీ తెచ్చుకున్న శివజ్యోతి.. షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్, పలు ఛానెల్స్‌లో వివిధ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యింది.

తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు
చిన్న వయసులోనే ఆమె గంగూలి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఈ దంపతులు హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వీరిద్దరూ ఈ స్థాయికి చేరుకున్నారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శివజ్యోతి పలుమార్లు కంటతడి పెట్టింది. అయితే ఆమె నోములు ఫలించి ఇటీవలే శివజ్యోతి గర్భం దాల్చారు. ఈ సంతోషంలో ఉండగానే... ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల దర్శనానికి వెళ్లిన శివజ్యోతి.. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై భక్తులు, సాంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో శివజ్యోతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. గతంలో జ్యోతక్కకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ముక్కు అవినాష్‌పై జ్యోతక్క పంచ్‌లు
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కొద్దిరోజుల క్రితం సిటీ vs విలేజ్ కాన్సెప్ట్‌తో ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌కి శివజ్యోతి హాజరై పంచ్‌లు విసిరింది. సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారని నటుడు వీరెన్ శ్రీనివాస్‌ను యాంకర్ శ్రీముఖి అడగ్గా.. మాది భీమవరం.. మందు, విందు అని చెప్పగా రికార్డింగ్ డ్యాన్స్‌లు కూడా అని శివజ్యోతి సెటైర్లు వేస్తుంది. ఈ సంక్రాంతికైనా పెళ్లి చేసుకోమ్మని ముక్కు అవినాష్‌కు చీవాట్లు పెట్టింది శివజ్యోతి. దాంతో ప్రపంచంలో పెళ్లిళ్ల గురించి ఆవిడకేం బాధ అని ముక్క అవినాష్ మండిపడతాడు. మేం విలేజ్ నుంచి వచ్చాం.. ఫ్యామిలీ, సంసారాలు ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి మాకు ప్రతి ఒక్కరి మీద అప్యాయత అని కౌంటర్ ఇచ్చింది జ్యోతక్క.
శివజ్యోతి నిజ స్వరూపం ఇదే
ఆ వెంటనే మీకు వీళ్లంతా ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు కానీ.. ఇంతకీ వీళ్లు విలేజేనా? కాదా? అని శ్రీముఖి అడుగుతుంది. ఆ మాట వినగానే జ్యోతక్క సీట్ల కిందకి వెళ్లి దాక్కుంటుంది. జ్యోతక్క అసలు స్వరూపం చూద్దామని శ్రీముఖి చెబుతుంది. ఆ వెంటనే స్క్రీన్ మీద బీచ్ ఒడ్డున మోడ్రన్ డ్రెస్‌లో శివజ్యోతి కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. పద్దతిగా ఉండే మా జ్యోతక్క... ఎంత హాట్‌గా ఉందో చూడండి అని శ్రీముఖి అనడంతో శివజ్యోతి సిగ్గుపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. శివజ్యోతిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











