కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో తెలంగాణ పిల్ల శ్రీముఖి ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్‌గా పరిచయం అయిన ఈ భామ.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది.

ఫలితంగా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త షో భాగం అయింది. ఇక, ఇందులో శ్రీముఖి ఓ కుర్రాడితో రొమాన్స్ చేసింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మూవీల్లో సత్తా చాటిన శ్రీముఖి

మూవీల్లో సత్తా చాటిన శ్రీముఖి

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి వచ్చింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈమె.. ఆ తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

యాంకర్‌గా బుల్లితెరపై రచ్చ

యాంకర్‌గా బుల్లితెరపై రచ్చ

వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ బ్యూటీ ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది', ‘పటాస్' వంటి షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది.

స్పీడు పెంచేసిన హాట్ భామ

స్పీడు పెంచేసిన హాట్ భామ

హోస్టుగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో మూడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఫినాలేలో ఓడిపోయింది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత మరింత ఉత్సాహంగా కెరీర్‌ను ముందుకు తీసుకుని వెళ్తోంది.

వరుస ఆఫర్లతో యమ బిజీగా

వరుస ఆఫర్లతో యమ బిజీగా

బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు ఇకపై సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ ‘మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో నటించింది.

మరో షోలో భాగం అయిందిగా

మరో షోలో భాగం అయిందిగా

బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై కొంత గ్యాప్ తీసుకున్న శ్రీముఖి.. ఇప్పుడు మరోసారి స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లలో తళుక్కున మెరిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' కొత్త సీజన్‌కు హోస్టుగా వ్యవహరిస్తోంది. గతంలో దీన్ని ప్రదీప్ నడిపించాడు.

షో రెచ్చిపోయిన యాంకరమ్మ

ఈ ఆదివారం ప్రారంభం కాబోతున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ఈ షో కోసం పాటను కూడా పాడింది. అలాగే, యంగ్ సింగర్లతో రొమాంటిక్‌గా మాట్లాడుతూ హొయలు పోయింది. ఈ క్రమంలోనే ఓ కుర్రాడితో కలిసి రెచ్చిపోయింది. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
అక్కడ చేయి వేయించుకుని

అక్కడ చేయి వేయించుకుని

‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' షోలో భాగంగా కంటెస్టెంట్‌గా వచ్చిన ఓ యంగ్ సింగర్‌తో శ్రీముఖి డ్యాన్స్ చేయడానికి జడ్జ్‌ల పర్మీషన్ తీసుకుంది. ఆ తర్వాత అతడి చేతిని తన నడుము మీద వేయించుకుని మరీ రొమాంటిక్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. ఇక, ఆమెతో డ్యాన్స్ చేసేందుకు మరికొందరు పోటీ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X