శ్రీముఖి భలే స్కెచ్ వేసిందే..! ఇలా కూడా ట్రాప్ చేస్తుందన్నమాట.. సక్సెస్ అయ్యేనా?
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. కేవలం చివరి వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆడియన్స్ తమకు సపోర్ట్ చేసేలా తమను తాము సరికొత్తగా ప్రమోట్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ కంటిస్టెంట్స్. ఇందులో భాగంగా శ్రీముఖి చేస్తున్న ప్రమోషన్ చూసి అరే! భలే స్కెచ్ వేసిందిగా అని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. ఆ వివరాలు చూస్తే..

చివరి వారం.. హౌస్‌లో ఐదుగురు
ఇటీవలే పద్నాలుగో వారం పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం చివరి వారంలో చేరిపోయింది. ఈ వారం ముగిసేసరికి బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటిస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్ లు ఫైనల్ రేస్‌లో పోటీ పడుతున్నారు.

ఆడియన్స్‌లో క్యూరియాసిటీ.. క్యాచ్ చేసుకునేలా
దీంతో ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి 50 లక్షలు సొంతం చేసుకోబోయేది ఎవరు అనే విషయంలో బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీ క్యాచ్ కంటిస్టెంట్స్ అంతా ఎవరికీ వారు సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ ఆడియన్స్ ఓట్లు అడుగుతున్నారు.

ఓట్లు సంపాదించే ప్రయత్నం.. సోషల్ మీడియా ఖాతాల ద్వారా!
ఈ నేపథ్యంలోనే కాస్త కొత్తగా ఆలోచించిన శ్రీముఖి.. ‘రాములమ్మ కాంటెస్ట్' పేరుతో ఓ స్కెచ్ వేసింది. గత కొంతకాలంగా శ్రీముఖి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఓట్ ఫర్ శ్రీముఖి' అంటూ విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా రాములమ్మ కాంటెస్ట్ పెట్టి ఆడియన్స్ నుంచి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసింది శ్రీముఖి.

ఇంతకీ ఏంటీ ఈ రాములమ్మ కాంటెస్ట్?
ఇంతకీ ఏంటీ ఈ రాములమ్మ కాంటెస్ట్ అనుకుంటున్నారా? విజయశాంతి నటించిన ‘ఒసేయ్ రాములమ్మ' సినిమాలోని టైటిల్ సాంగ్ పై శ్రీముఖి వేసే ఒక సిగ్నేచర్ స్టెప్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. దీన్నే ఇప్పుడు ‘రాములమ్మ కాంటెస్ట్' గా మార్చేసింది శ్రీముఖి. ఇందులో గెలిచిన వారు తనతో డాన్స్ చేయొచ్చు అని తెలిపింది.
శ్రీముఖి అధికారిక ఖాతా.. అలా చెప్పేశారు
ఆసక్తిగల వారు రాములమ్మ సిగ్నేచర్ స్టెప్‌తో ఒక వీడియో చేసి #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపారు. ఇలా వచ్చిన వీడియోల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. వారికి శ్రీముఖితో డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ విషయాన్ని శ్రీముఖి అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

బిగ్ బాస్ విన్నర్ కావాలని..
బిగ్ బాస్ సీజన్ 3 లో విజేతగా నిలిచేది శ్రీముఖినే అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే శ్రీముఖి టీం కూడా ఈ రకంగా ప్రచారం చేస్తుండటం విశేషం. సో.. బిగ్ బాస్ విన్నింగ్ కోసం శ్రీముఖి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











