Anchor Sreemukhi: నాకు 3 బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. కానీ ఫరెవర్ లవర్ ఆయనే!
అచ్చమైన తెలుగు అమ్మాయి.. అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. పటాస్ షోలో అదిరిపోయే పంచులు వేస్తూ.. అంతకు మించిన అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తున్న ఈమె తాజాగా తనకు మొత్తం ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఫరెవర్ లవర్ మాత్రం అతనేనంటూ వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగంలో అడుగు పెట్టింది. ముఖ్యంగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోలు చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెర పైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించాలనుకుని... 2012లో జులాయి సినిమా చేసింది. ఆమె అందం, అభినయం గుర్తించిన దర్శక, నిర్మాతలు అనేక సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా చేయాలంటే కొన్నాళ్లు బుల్లితెరపై కనిపించొద్దని కూడా చెప్పారట.

కొన్నాళ్లు సన్నగా అయి ఎదురు చూసిన పెద్ద ఎత్తున ఆఫర్లు రాకపోవడంతో.. మళ్లీ టీవీలో ప్రోగ్రాంలు చేసింది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 5 తెలుగులో తెగ రచ్చ చేసింది రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి వరసుగా షోలు, సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ లో కూడా మంచి పాత్రలోనే మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ మాటీవీలో వస్తున్న సూపర్ సింగర్ షోకు యాంకర్ గా చేస్తోంది.

ముఖ్యంగా దీనికోసం చాలా కష్టపడుతూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు ఓటీటీలు వచ్చాకా టీవీలు చూడడం మానేశారని.. కానీ మళ్లీ టీఆర్పీ పెరిగేలా చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని వివరించింది. అలాగే సూపర్ సింగర్ షో కోసం తను ఎంతగా శ్రమ పడుతుందో వివరించింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కోసం తనకు మొత్తం ముగ్గురు అబ్బాయిలతో లవ్ ట్రాక్ వేశారని.. అలా తనకు మొత్తం ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

ప్రోగ్రాం స్టార్టింగ్ లో వెంకటేష్ అనే అబ్బాయితో ప్రేమ కథ నడిచిందని ఆ తర్వాత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపానని చెప్పింది. ఇక ఫరెవర్ లవ్ ట్రాక్ మాత్రం అనంత శ్రీరామ్ గారితో చేస్తున్నానంటూ వివరించింది. ఇలా తన ముగ్గురు ప్రియుల పేరు చెప్పిన ఈ బ్యూటీ.. తన ఫరవెర్ లవర్ నేమ్ కూడా చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంత డైరెక్ట్ గా ఇలా చెప్పేసిందేంటి భయ్యా అంటూ తలలు పట్టుకుంటున్నారు. షోలు, సినిమాల్లో ఎన్నో లవ్ లు ఉన్నా రియల్ లైఫ్ లో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఇంకా సింగిల్ గానే ఉంది.


Click it and Unblock the Notifications











