అమర్‌దీప్ పరువు తీసిన శ్రీముఖి.. ఆ కొట్టుడు కొట్టాలి, పిల్లల్ని కనాలి అంటూ!
ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కొత్త కొత్త షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్ షోలుగా సాగిపోతోన్నాయి. అందులో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే షో ఒకటి. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ కామెడీ గేమ్ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి, తేజస్వినితో యాంకర్ శ్రీముఖి ఊహించని కామెంట్లు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!
స్టార్ మా పరివారం అంటూ
తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోలతో ఒకటిగా వెలుగొందుతోన్నదే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఇది యమా అలరిస్తూ సాగిపోతోంది. ఇందులో యాంకర్ శ్రీముఖి చేసే అల్లరితో పాటు గెస్టుల హడావిడి బాగుంటుంది. అలాగే, ముక్కు అవినాష్, ఫైమా కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. ఇది ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది.

సెలెబ్రిటీలను ఆడుకుని
శ్రీముఖి సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు హోస్ట్ చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కూడా ఒకటి. టీవీ, సినిమా రంగానికి చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా రన్ అవుతోంది. దీనికి వచ్చిన వారితో శ్రీముఖి యమా ఆడుకుంటోంది.
ఈ ఆదివారం కృష్ణాష్టమి
వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమం కృష్ణాష్టమి స్పెషల్‌గా రాబోతుంది. ఇందులోకి బుల్లితెరపై జంటలుగా ఫేమస్ అయిన సెలెబ్రిటీలను తీసుకు వచ్చారు. ముఖ్యంగా ప్రియాంక జైన్ - శివకుమార్, ఇమాన్యూయేల్ - వర్ష, తేజస్విని - అమర్‌దీప్ చౌదరి సహా మరో రెండు జంటలు వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

వాళ్లతో ఆటలు.. పంచ్‌లు
కృష్ణష్టమి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో సెలెబ్రిటీలతో శ్రీముఖి తనదైన రీతిలో ఆటలు ఆడించింది. ముఖ్యంగా ఇందులో జంటలకు మంచి మంచి రొమాంటిక్ పోటీలు పెట్టింది. ఇవన్నీ ప్రేక్షకులకు మజాను పంచేలా సాగాయి. మరీ ముఖ్యంగా ఇందులో శ్రీముఖిపై సెలెబ్రిటీలు, వాళ్లపై ఆమె పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేసుకున్నారు.
ఆ కొట్టుడు కొట్టడం కాదు
ఈ షోలో అమర్‌దీప్ చౌదరి - తేజస్విని జంట హైలైట్ అయింది. ఇందులో వీళ్లిద్దరితోనూ శ్రీముఖి కొన్ని గేమ్స్ ఆడించింది. ముఖ్యంగా ఉట్టి కొట్టే టాస్క్ పెట్టారు. ఇది మొదలయ్యే సమయంలో అమర్ 'ఒక్క పిట్టనైనా కొట్టలేదు అంటారు. నేను చాలా పిట్టల్ని కొట్టాను' అన్నాడు. దీంతో శ్రీముఖి 'నువ్వు కొట్టే పిట్టలు కాదు వేరేవి' అంటూ డబుల్ మీనింగ్‌లో పంచ్ వేసింది.
పిల్లల్ని ఎప్పుడు కంటారు
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో జరుగుతోన్న సమయంలో శ్రీముఖి 'పిల్లలు అంటే నాకు గుర్తుకు వచ్చేది అమర్ అండ్ తేజు. నా చేతికి ఎప్పుడు బుజ్జి బుజ్జి పిల్లలను ఇవ్వబోతున్నారు. ఇప్పుడే చెప్పండి' అని అడిగేసింది. దీంతో వాళ్లిద్దరూ బాగా సిగ్గు పడిపోయారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి పరువును శ్రీముఖి తీసేసిందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











