Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖిలో ఆ లోపం.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదట!
బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ.. అద్భుతమైన టాలెంట్ తో దుమ్ములేపే యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయే కామెడీ పంచులు, అంతకు మించిన స్పాంటెనియస్ తో ఎప్పుడూ అందరినీ నవ్వించే ఈమె.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం గురించి వివరించింది. తనలో ఆలోపం ఉందని పలువురు అనుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని ఆర్మూర్ లో పుట్టి పెర్గిన ఈ ముద్దుగుమ్మ ముందుగా యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోలు చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇలా కేవలం షోలు మాత్రమే చేయకుండా సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది. 2012లో జులాయి సినిమా చేసిన ఈమె అందం, అభినయం గుర్తించిన దర్శక, నిర్మాతలు అనేక సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. ఇలా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది.

ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ రచ్చ చేసిన ఈమె బిగ్ బాస్ కు కూడా వెళ్లింది. మూడో సీజన్ లో పాల్గొన్న ఈమె అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ.. రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి వరసుగా షోలు, సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ లో కూడా మంచి పాత్రలోనే మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ మాటీవీలో స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ అనే షో చేస్తోంది.
ఈ షోకి ఎప్పటికప్పుడు సీరియల్స్ తో పాటు సినీ తారలను కూడా తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. అదిరిపోయే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ షో ప్రతీ ఆదివారం తెగ రచ్చ చేస్తుండగా.. తాజాగా ప్రోమో విడుదల అయింది. ఇందులో అత్తలు గొప్పా, కోడళ్లు గొప్పా అనే ఓ షో చేసింది. అయితే ఈ క్రమంలోనే ముందుగా కోడళ్లను పిలిచి సందడి చేసిన ఈమె ఆ తర్వాత అత్తలను స్టేజీ మీదకు రమ్మంది. అప్పుడే సీరియల్ నటి జ్యోతి రెడ్డి వచ్చింది. అయితే తాను తన కోడలికి నైటీ వేసుకుని ఆమ్లెట్ వేయడం నేర్పించినట్లు చెప్పింది.

అయితే నైంటీ వేసుకుని నేర్పించారా అని శ్రీముఖి అనగా... మీరు అలాగే చేస్తారు, మేము మాత్రం నైటీలు వేసుకునే చేస్తామని చెప్పింది. వెంటనే శ్రీముఖి నాకింకా పెళ్లి కాలేదని చెప్పగా.. ఏంటీ ఇంకా కాలేదా అంటూ ముక్కున వేలేసుకుంది జ్యోతి రెడ్డి. అదేంటి అంత తేడాగా.. నాలో ఏదో లోపం ఉన్నట్లు చూస్తున్నావు అంటుంది. నాకేం లోపం లేదు నేనే కావాలని పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











