నువ్వు వద్దు.. నీ అమ్మాయిని పంపించు.. శ్రీముఖి షాకింగ్ కామెంట్స్
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది యంగ్ బ్యూటీ శ్రీముఖి. పటాస్ కామెడీ షోతో స్మాల్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ రంగంలో సెన్సేషన్ గా మారింది. స్టార్ యాంకర్ గా టీవీ షోలో, ఈవెంట్లను హోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైను తన దైన శైలిలో టీవీ ప్రొగ్రామ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో శ్రీముఖికి సంబంధించి ఓల్డ్ కామెంట్స్ కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ శ్రీముఖి ఏ సందర్భంలో అలా మాట్లాడిందనే వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై సెన్సేషన్ గా..
స్మాల్ స్క్రీన్ పై యాంకర్ శ్రీముఖి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. తన యాంకరింగ్ స్కిల్స్, వాక్ చాతుర్యం, రూప సౌందర్యంతో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. ఇక పటాస్ షో తర్వాత చాలా టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది శ్రీముఖి. అదుర్స్, జీ సరిగమప, భలే ఛాన్స్ లే, కామెడీ నైట్స్, డ్రామా జూనియర్స్ ఛాంపియన్స్, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్, సరిగమప ది సింగింగ్, డ్యాన్స్ ఐకాన్, సూపర్ సింగర్, నీతోనే డ్యాన్స్ 2.0, సరిగమప నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ వంటి టీవీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.

బిగ్ బాస్ షోతో మరింతగా..
టీవీ షోలతో యాంకర్ గా అలరిస్తూనే శ్రీముఖి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ 4లోనూ కంటెస్టెంట్ గా అలరించింది. హౌజ్ లో తనకు వీలైనంతగా ఎంటర్ టైన్ మెంట్ ను పంచేందుకు ప్రయత్నించింది. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరిన్ని టీవీ షోలకు హోస్ట్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం గేమ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ షో నేటికీ స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ఇక రీసెంట్ గానే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2ను పూర్తి చేసుకుంది.
శ్రీముఖి షాకింగ్ కామెంట్స్..
యాంకర్ శ్రీముఖికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టీవీ షోలో, సినిమాలతో వెండితెరపై మెరియడమే కాకుండా సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ వస్తుంది. ఇదే సమయంలో ఫ్యాన్స్ కూడా శ్రీముఖి పోస్టులు, కామెంట్స్ ను వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీముఖి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు టీవీ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. సినిమా ఆఫీస్ లకు వెళ్తే ఆ కంటెస్టెంట్ ను కాదని, వాళ్ల అమ్మాయిని పంపించమని అడుగుతున్నారంటూ కామెంట్స్ చేయడం షాకింగ్ మారింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్రీముఖి బీబీ జోడీ షోలో ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శ్రీముఖి వెండితెరపైన చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ తో అలరించింది.


Click it and Unblock the Notifications











