ఆ కమెడియన్‌తో అలా కనిపించి షాకిచ్చిన శ్రీముఖి: అర్ధరాత్రి మధ్యలో భయకరంగా అంటూ సెల్ఫీ వీడియో!
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో గ్లామరస్ భామ శ్రీముఖి ఒకరు. నటిగా సినిమాల్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోంది. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇక, తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా కమెడియన్ సద్దాంతో కలిసి ఊహించని విధంగా కనిపించింది. అంతేకాదు, అర్ధరాత్రి భయంకరంగా అంటూ షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. అల్లు అర్జున్ మూవీతో
చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది శ్రీముఖి. ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది.
పూజా హెగ్డే హాట్ అండ్ సెక్సీ ఫోటో గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

అదుర్స్ షోతో ఎంట్రీ.. బొమ్మ అదిరింది వరకూ
సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటోన్న టైమ్‌లోనే 'అదుర్స్' అనే షోతో శ్రీముఖి యాంకర్‌గా అడుగులు వేసింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈ ప్రయాణంలో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసి మెప్పించింది.

శ్రీముఖి రాములమ్మగా మారింది.. విమర్శలు
తన యాంకరింగ్ ప్రస్థానంలో ఎన్నో షోలను ముందుండి నడిపించింది శ్రీముఖి. అందులో ఎక్కువ గుర్తింపును తెచ్చింది మాత్రం 'పటాస్' షోనే. ఇందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షో వల్లే ఆమెకు రాములమ్మ అనే పేరు కూడా వచ్చింది. ఇందులో వ్యవహరించిన తీరు వల్ల ఆమెపై విమర్శలు రావడంతో పాటు షోపై వ్యతిరేకత వచ్చింది.

సినిమాల విషయంలో యూటర్న్.. బాస్ వల్లే
తనకు కేవలం స్పైసీ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారన్న కారణంతో సినిమాలకు దూరమైంది శ్రీముఖి. అలాంటి సమయంలోనే బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచింది. అయినప్పటికీ వరు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ చిత్రంలోనూ చాన్స్ పట్టేసింది.

ఎప్పుడూ అక్కడే హల్‌చల్.. హాట్ షోతో రచ్చ
వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

కమెడియన్‌తో అలా కనిపించి షాకిచ్చిన శ్రీముఖి
షూటింగ్ స్పాట్‌లో ఒత్తిడిని తట్టుకునేందుకో.. మరో కారణమో తెలియదు కానీ.. సెట్స్‌లో ఉన్న సమయంలోనే కొన్ని వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోంది శ్రీముఖి. ఇందులో భాగంగానే తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. విరామం సమయంలో కమెడియన్ సద్దాంతో కలిసి షాకింగ్ వీడియో చేసింది. ఇందులో ఆమె విచిత్రమైన లుక్‌తో కనిపించింది.

అర్ధరాత్రి మధ్యలో భయకరంగా అంటూ సెల్ఫీ
తన మొబైల్‌లోని యానిమల్ ఫిల్టర్‌ను ఉపయోగించి శ్రీముఖి ఓ ఫన్నీ సెల్ఫీ వీడియో చేసింది. ఇందులో ఆమె జంతువులా కనిపించింది. ఆమెతో పాటే సద్దాం కూడా ఉన్నాడు. 'అర్ధరాత్రి షూటింగ్ చేస్తున్నాం. నిద్ర వస్తుంది.. ఇంటికెళ్లాలి' అని కామెంట్ చేశారీ ఇద్దరు. ఇక, చివర్లో షూట్‌కు పేకప్ చెప్పేసిన శ్రీముఖి.. వీడియో చేస్తూ.. మధ్యలో భయంకరమైన ఫేస్ వచ్చింది అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











