ఊహించని విధంగా శ్రీముఖి హాట్ షో.. పొట్టి డ్రెస్సులో థైస్ పైవరకు చూపిస్తూ పోజులు!
బుల్లితెర యాంకర్లు బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీరి బాటలోనే రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచుతూ వెళ్తోంది బ్యూటిఫుల్ శ్రీముఖి. బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.
చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘాటు ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తోంది. ఫలితంగా అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

మర్చిపోలేని విధంగా..
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడో కాలు మోపిన శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. పటాస్ షోలో శ్రీముఖి యాంకర్ రవితో చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ బ్యూటి. ఇలా అటు సినిమా, ఇటు బుల్లితెర వంటి రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది.

అతని హిట్ మూవీతో..
శ్రీముఖి మొదటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

వివిధ షోలతో అట్రాక్ట్..
సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసింది ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తెచ్చుకుంది.

చిరంజీవీతో నడుము సీన్..
యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమా సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది. ఇందులో శ్రీముఖితో చిరంజీవి పవన్ కల్యాణ్ ఖుషీ మూవీ నడుము సీన్ ను రిపీట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక గతేడాది విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఆకట్టుకుంది యాంకరమ్మ. అలాగే బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్స్ కు తక్కువ..
ఇలా పలు విధాలుగా తెలుగు ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తోంది బొద్దుగుమ్మ శ్రీముఖి. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ. హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి.
థైస్ పైవరకు చూపిస్తూ..
తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. తాజాగా పైనుంచి లైట్ కలర్ కోట్ వేసుకుని లోపల రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ లుక్స్ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రీముఖి. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోలకు పోజులిచ్చిన యాంకర్ శ్రీముఖి షార్ట్ డ్రెస్సుతో అందాలను ఆరబోసింది. ఇందులో శ్రీముఖి తన థైస్ పై వరకు అందాలను చూపిస్తూ ఘాటు పోజులు ఇచ్చింది. బీబీ జోడీ రియాల్టీ షో కోసం వేసుకున్న ఈ డ్రెస్సులో హాట్ గా థైస్ అందాలను ఆరబోసింది శ్రీముఖి.


Click it and Unblock the Notifications











