తడి తడి అందాలతో శ్రీముఖి , స్విమ్మింగ్ పూల్‌లో సెగలు.. అక్కడి వరకు చూపిస్తూ
తెలుగు బుల్లితెరపై వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో తన టైమింగ్, కామెడీ పంచ్‌లతో తెలుగింటి లొగిళ్లకు బాగా చేరువైన ఈ ముద్దుగుమ్మ ముఖంపై చిరునవ్వుతో, చలాకీగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీముఖి హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
10 మే 1993న నిజామాబాద్‌లో పుట్టారు శ్రీముఖి. ఆమె పూర్తి పేరు శ్రీముఖి రాథోడ్. ఈమె డెంటల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తొలుత అదుర్స్ షోకు హోస్టింగ్ చేసిన శ్రీముఖి.. తర్వాత సూపర్ సింగర్ 9కి హోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ , జులాయి వంటి సినిమాలలో చిన్నాచితకా క్యారెక్టర్లు వేస్తూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి. సినిమాలలో అంతగా లక్ కలిసి రాకపోవడంతో బుల్లితెరపై పూర్తిగా ఫోకస్ చేశారు. ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి .

ఈ నేమ్ అండ్ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 3లో ఛాన్స్ కొట్టేశారు. తన మైండ్ గేమ్, ఆటతీరు, హాట్ షోతో బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించిన శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచినా లాస్ట్ మినిట్‌లో లక్ కలిసి రాలేదు. ఆ టైంలో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని, ప్రైజ్‌మనీని ఎగరేసుకుపోయారు. అయితే టైటిల్ మిస్ అయినా శ్రీముఖికి రెమ్యునరేషన్ కింద భారీగానే అందుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి
అయితే బిగ్‌బాస్ ఇమేజ్ శ్రీముఖి కెరీర్‌కి బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఆ షో తర్వాతి నుంచి ఆమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. బుల్లితెరపై షోలు, మూవీ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూనే పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు ఈ బొద్దుగుమ్మ. ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్‌లో నటించి మెప్పించారు. కొన్ని సినిమాలలో ఆమె హీరోయిన్‌గా నటించి తన అందాలు ఆరబోశారు.
తన సినిమాలు, షోస్‌తో బిజీగా ఉంటూనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రానికి అనుగుణంగా తన సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెడుతోంది శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ ప్రారంభించి మంచి ఆదాయాన్ని అందుకుంటున్నట్లుగా బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. ఇవి కాక పలు ఉత్పత్తులకు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనల ద్వారా ఏడాదికి రూ. కోట్లలో సంపాదిస్తోందని అంటుంటారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు సినిమాలు, తన షోలు, ఫోటోలు, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతూ తన తడి అందాలను ఆరబోస్తున్న వీడియోను శ్రీముఖి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం శ్రీముఖి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











