అది జరిగి ఉంటే.. ఇప్పుడు నలుగురు పిల్లలకు తల్లిని.. యాంకర్ శ్రీముఖి
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీముఖి. యాంకర్ గా పలు టీవీ షోలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ తన సత్తా చాటుకుంటోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ టెలివిజన్ ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. 'పటాస్' కామెడీ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరియమై అప్పటి నుంచి పాపులర్ టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం టాప్ షోలకు యాంకర్ గా పనిచేస్తోంది. దీంతో ఇప్పుడైతే శ్రీముఖి కెరీయర్ కు ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోతోంది.
శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆయా షోల్లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఒకటి. ఈషోలో చాలా కాలంగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోంది. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తూ సెలబ్రెటీలతో పలు గేమ్స్ ఆడిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుకుంటోంది. తనదైన శైలిలో పంచులు, ప్రసాలు వాడుతూ కపుబ్బా నవ్వించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన గురించి తానే ఆసక్తికరమైన విషయాలను చెప్పుకుంటూ వస్తోంది. ఇక తాజాగా తన పెళ్లి టాపిక్ ను తీసుకొచ్చింది.

టెలివిజన్ రంగంలో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా? అని శ్రీముఖి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆమె తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ సెషన్ నిర్వహించిన సమయాల్లోనూ అదే ప్రశ్నలతో బుల్లితెర రాములమ్మను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. మరోవైపు ఓ వ్యాపార వేత్తతో పెళ్లిని, మరో సీరియల్ నటుడితో లవ్ అంటూ పలు రకాలుగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీముఖి పెళ్లి అంటూ పలు సందర్భాల్లో వార్తలు కూడా గుప్పు మంటున్నాయి. అయితే వాంటన్నింటిని శ్రీముఖి ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే వస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం సమ్మర్ క్యాంప్ స్పెషల్ షోలో తన పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. సెలబ్రెటీల పిల్లలతో స్పెషల్ ఎపిసోడ్ ను ప్రదర్శించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా పిల్లలతో శ్రీముఖి ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ ఆకట్టుకుంది. మరోవైపు పిల్లలను ఎత్తుకొని.. తనకే గనుక పెళ్లై ఉంటే నలుగురు పిల్లలకు తల్లై ఉండేదాన్ని అని అనింది. దీంతో సెట్ మొత్తం గొలగొలగా మారిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ లోనూ సీరియల్ నటుడు విష్ణుకాంత్ తో లవ్, పెళ్లి అంటూ మాట్లాడటం కూడా హాట్ టాపిక్ గ్గా మారింది.
అయితే, ఇవన్నీ శ్రీముఖి స్కిట్ లో భాగంగా చేస్తోందా? లేక కావాలనే తన అభిమానులకు పెళ్లిపై హింట్ ఇస్తుందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా శ్రీముఖి టెలివిజన్ రంగంలో మంచి సక్సెస్ ను సాధిస్తోంది. మరోవైపు డ్యాన్స్ ఐకాన్ 2, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ వంటి షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. మరోవైపు సినిమాల్లో వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకుంటోంది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంతో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఆమె సీన్ ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. మున్ముందు ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











