Anchor Sreemukhi:నీలో మ్యాటర్ లేదంటూ..సీరియల్ హీరోను ఘోరంగా..ఆ పార్ట్‌ను టచ్ చేస్తూ శ్రీముఖి సంచలనం
స్రీన్ మీద కొందర్ని ఎప్పుడు చూసినా సూపర్ ఎనర్జటిక్‌గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో యాంకర్ శ్రీముఖి ముందు వరుసలో ఉంటారు. శ్రీముఖిని ఎప్పుడు చూసినా మంచి జోష్‌లో కనిపిస్తోంటుంది. సినిమాల్లో హీరోయినగా ఇండస్ట్రీకి పరిచియమైన శ్రీముఖి..తరువాత బుల్లితెర మీద తన హావాను చూపిస్తోంది. పలు షోలకు యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటించి సత్తా చాటుతోంది. తన షోలకి వచ్చిన గెస్ట్‌లందరినీ ఆటపట్టిస్తూ..మంచి రేటింగ్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది.
శ్రీముఖికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఆదివారం విత్ పరివారం అనే షోకు హొస్ట్‌గా వ్యవహారిస్తోన్న శ్రీముఖి... తాజాగా ఆ షోలో హల్ చల్ చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది ఆ వివరాల్లోకి వెళ్తే...

హీరోయిన్ కాబోయి హీరోకి చెల్లెలుగా:హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చానని శ్రీముఖి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రీముఖి కూడా హీరోయిన్ మెటీరియలే కాని.. ఆమెకు హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు దక్కలేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి సినిమాలో హీరోకు చెల్లెలుగా నటించింది. ఈ సినిమాలో శ్రీముఖి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కాని ఆ సమయంలో త్రివిక్రమ్ ఇచ్చిన సలహాతో శ్రీముఖి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది

ఆ షోతో పాపులారిటీ:జులాయి సినిమా తరువాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. శ్రీముఖి బుల్లితెరకు షిప్ట్ అయింది. టెలివిజన్‌లో మాత్రం శ్రీముఖికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పటాష్ షోతో శ్రీముఖి బాగా పాపులర్ అయింది. పటాష్ షో శ్రీముఖికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలోనే యాంకర్ రవి, శ్రీముఖిల మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. కాని ఈ రూమర్స్‌ను శ్రీముఖి పెద్దగా పట్టించుకోకుండానే ముందుకు సాగింది.

అక్కడా నిరాశే:యాంకర్‌గా కెరీర్ పిక్ టైంలో ఉన్నప్పుడే శ్రీముఖికి బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో టాప్ కంటెస్ట్‌గా అడుగుపెట్టిన శ్రీముఖి..టైటిల్ కోసం చివరి వరకు పోరాడింది. అందరూ కూడా శ్రీముఖికి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తుందని భావించారు. కాని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విన్నర్‌గా కావడంతో.. శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ షోకు గాను కోటి రూపాయిల వరకు ఆమెకు రెమ్యూనరేషన్ పుచ్చుకుందనే వార్తలు వచ్చాయి.

శ్రీముఖి కెరీర్:శ్రీముఖి కెరీర్ సాఫీగానే సాగుతుంది. అటు టెలివిజన్ షోలతో పాటు, ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ప్రస్తుతం ఆమె ఐదు షోలకు యాంకరింగ్ చేస్తోంది. మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు వంటి టాప్ టెలివిజన్ ఛానెల్స్‌లో యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. వీటితో పాటు అమ్మడు చేతిలో పలు సినిమా ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ షోలో సంచలనం ..నీలో మ్యాటర్ లేదంటూ..:మా టీవీలో ప్రసారం అయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే షోకు గెస్టులుగా వచ్చిన సీరియల్ ఆర్టిస్ట్‌లను శ్రీముఖి ఓ ఆట ఆడుకుంది. పలు సీరియల్స్‌లోని హీరోలను షోకు గెస్ట్‌లుగా పిలిచి వారిని రోస్ట్ చేసింది. ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్‌ను శ్రీముఖి తెగ ర్యాగింగ్ చేసింది. అమర్ దీప్‌కు ఇటీవల పెళ్లైంది..కాని అక్కడ మ్యాటర్ ఏమి లేదంటూ ఘోరంగా కామెంట్ చేసింది. ఎవరు చెప్పారండీ మీకూ అంటూ శ్రీముఖి చేసిన కామెంట్స్‌పై అమర్ దీప్ చాలా ఫన్నీగానే స్పందించాడు. అమర్ దీప్ తన తోటి నటి తేజస్విని గౌడ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











