For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందు కొట్టే అలవాటు ఉందా? నిజాయితీగా ఒప్పుకున్న యాంకర్ శ్రీముఖి!

|

ఒకప్పటి టీవీ యాంకర్లతో పోలిస్తే... ఇప్పటి టీవీ యాంకర్ల తీరే వేరయా అని ఒప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం ఫాంలో ఉన్న సుమ, అనసూయ, రష్మిలతో పోలిస్తే వారికి భిన్నంగా కిరాక్ యాటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీముఖి.

'పటాస్' షో పాపులర్ అవ్వడానికి యాంకర్ రవితో పాటు శ్రీముఖి కూడా మెయిన్ రీజన్ అని చెప్పక తప్పదు. తన యాంకరింగుతో ఆమె ఈ తరం యువతను ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇటీవలే ఈ షో నుంచి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన శ్రీముఖి... తాజాగా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తూ వారు అగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

నాలోని విలనిజం చూపించాలని ఉంటుంది

ఓ అభిమాని ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... ‘నాకు బేసిగ్గా విలన్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్‌లో నేను చాలా మంచి దాన్ని. కనీసం విలన్ రోల్స్ చేయడం వల్ల నాలోని విలనిజాన్ని మీకు చూపించాలనే కోరిక బలంగా ఉంటుంది. విలన్ రోల్స్ వల్ల నటిగా నిరూపించుకునే అవకాశం ఎక్కువ. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని' శ్రీముఖి తెలిపారు.

అరవడం వల్ల గొంతు దెబ్బతింది

నేను నా కెరియర్ మొత్తంలో చాలా షోలు చేయడం, ఆ షోలలో ఎక్కువగా మాట్లాడటం, అరవడం వల్ల నా గొంత కొంచెం ఎఫెక్ట్ అయింది. కానీ ఈ ఫీల్డులో ఉన్నపుడు ఇవి తప్పదు. భరించాల్సిందే. అందుకు తగిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు... ఓ ప్రశ్నకు శ్రీముఖి సమాధానం ఇచ్చారు.

అనసూయ, రష్మి, ప్రదీప్ మాచిరాజు, హైపర్ ఆది గురించి

రష్మి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అనసూయ హార్డ్ వర్కింగ్ అండ్ ఫ్యామిలీ పర్సన్స్. నాకు ఇద్దరూ చాలా ఇష్టం. మా యాంకర్లందరికీ దేవత... యాంకర్ మదర్ ఇండియా మా సుమక్క. మగ యాంకర్ల విషయానికొస్తే... నా కెరీర్ వెరీ టాలెంటెడ్ ప్రదీప్ మాచిరాజుతో మొదలు పెట్టాను. హైపర్ ఆది చాలా టాలెంట్ పర్సన్ అండ్ అమేజింగ్ రైటర్.... అంటూ శ్రీముఖి వారిపై తన అభిప్రాయం తెలిపారు.

మీ అభిమానం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది

నాకు సోషల్ మీడియాలో ఇంత మంది అభిమానులు ఉండటం సంతోషంగా ఉంటుంది. ఇంత మంది నన్ను అడ్మైర్ చేయడం అదొక గొప్ప ఫీలింగ్. మీ అభిమానం మమ్మల్ని మరింత బాగా చేయాలనేలా ముందుకు నడిపిస్తుందని... శ్రీముఖి చెప్పుకొచ్చారు.

అది వారి పర్సనల్, కామెంట్ చేయను

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘‘సృజన తిన్నావా'' ఆడియో క్లిప్ మీద స్పందించాలని కొందరు కోరగా... ‘ఎవరో ఇద్దరి పర్సనల్ ఆడియో క్లిప్ బయటకు వచ్చినపుడు... జనాలకు వినడానికి క్యూరియా సిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ వారి ప్రైవసీకి రెస్పెక్ట్ ఇస్తున్నాను. దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు.' అని శ్రీముఖి తెలిపారు.

మందుకొట్టే అలవాటు ఉందా?

మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రీముఖి మొమమాటం లేకుండా సమాధానం ఇచ్చారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే... అకేషనల్లీ మందు కొడతాను. ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యం కూడా..'' అంటూ నిజం ఒప్పుకున్నారు శ్రీముఖి.

English summary
"Occasionally I drink alcohol. I like wine. It's also healthy too." Anchor Srimukhi about her drinking habit. Anchor Sreemukhi responds on Marriage and Bigg Boss Telugu 3 show. "There is no truth in the news," she said. The anchor made her fans happy with trademark laugh of Ramulamma.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more