కరోనా, ఆర్జీవీ రెండూ ఒకటేనా?.. యాంకర్ సుమ అంత మాట అనేసింది ఏంటి మరి!
యాంకర్ సుమ కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఓ షోలో హోస్టింగ్ చేసినా, పార్టిసిపేట్ చేసినా అందులో సుమ ముద్ర కనబడాల్సిందే. హోస్ట్‌గా చేసే షోల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసే ఎంటర్టైన్మెంట్ షోల్లోనూ అంతే రఫ్పాడిస్తుంది. తాజాగా సాయి కుమార్ హోస్ట్‌గా ప్రారంభం కాబోతోన్న వావ్ కొత్త సీజన్‌లో సుమ సందడి చేసింది. ఇక సుమ చేసే అల్లరి, వేసే పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పంచ్‌లతో హల్చల్..
బుల్లితెరపై పంచ్‌ల మహారాణిగా పేరొందిన సుమ.. మాటల ప్రవాహధాటికి తట్టుకుని నిలబడం ఎవ్వరికైనా కష్టమే. సుమ సెటైర్ వేస్తే దానికి తిరుగుండదు. వెంటనే అరక్షణం కూడా ఆలస్యం కాకుండా అవతలి వ్యక్తికి పంచ్ వేస్తుంటుంది. అలాగే వావ్ లోనూ దుమ్ములేపింది.

వయసెంతో చెప్పకుండా..
అనసూయ, ధన్‌రాజ్, మనో, సుమ ఇలా నలుగురు షోకు గెస్ట్‌గా వచ్చారు. వయసెంతో చెప్పమని సాయి కుమార్ పార్టిసిపేట్స్ అందర్నీ అడిగాడు. అందరూ తమ తమ వయసెంతో చెబుతూ ఉండగా సుమ మాత్రం దాటవేసింది. దీంతో ఎందుకు అని అడగ్గా ప్రోమో కోసమని పంచ్ వేసింది.

అనసూయకు అదిరే కౌంటర్..
లాక్ డౌన్ మొదలైన కొత్తలో అనసూయ ఓ అంశాన్ని లేవనెత్తిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. పని లేకపోతే అప్పులు, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సమయంల్ అనసూయపై విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. అయితే ఆ తరువాత మారటోరియం అనే విధానం రావడం, ఈఎంఐలు వాయిదా వేయడం జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. మారటోరియం నా వల్లే వచ్చిందని అనసూయ అంటే ఇంకా నయం కరోనా కూడా నీవల్లే వచ్చిందని అనలేదని సుమ పంచ్ వేసింది.

రెండింటికి వ్యాక్సిన్ లేదు..
ఇక ఆటలో భాగంగా రెండు నంబర్లు ఎంచుకున్నారు. అందులో ఒకదాంట్లో కరోనా వైరస్, మరొక దాంట్లో రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. దీంతో వారంతా పగల బడి నవ్వారు. అయితే సుమ మాత్రం అదిరిపోయే కౌంటర్ వేసింది. ఆ రెండింటికి వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదని సెటైర్ వేసింది. మొత్తానికి సుమ టైమింగ్ అందరూ ఫిదా అయ్యారు. నిజంగానే ఆ రెండూ ఒకటే అని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











