దీప్తి సునయన-షణ్ముఖ్ రిలేషన్ బట్టబయలు.. అలా వచ్చి ఇలా ఇరుక్కుపోయాడు!!

దీప్తి సునయన గురించి, ఆమె వ్యవహారం గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. బిగ్‌బాస్ రెండో సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బాగానే ఫేమస్ అయింది. అయితే అంతకు ముందు డబ్ స్మాష్, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ తెగ హల్చల్ చేసేది. అలా వచ్చిన క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. తనీష్, సామ్రాట్, తేజస్వీ, దీప్తి సునయనల గ్యాంగ్ బాగానే వైరల్ అయింది. మరీ ముఖ్యంగా తనీష్‌తో దీప్తి వ్యవహారం బాగానే రచ్చగా మారింది.

ఇద్దరూ ఓదార్చుకున్నారు..

ఇద్దరూ ఓదార్చుకున్నారు..

బిగ్‌బాస్ షోలో తనీష్, దీప్తి సునయన ఓ రేంజ్ రిలేషన్ మెయింటైన్ చేశారు. అది స్నేహం కంటే ఎక్కువగానే ఉందని అందరూ కామెంట్లు చేశారు. ఇద్దరూ ఒకరి బాధలను మరొకరికి చెప్పుకుని ఓదార్చుకునే వారు. ఇక దీప్తి సునయన బెట్టు చేయడం, తనీష్ బతిమాలడటం, ఇలా ఈ ఇద్దరు పండించిన కెమిస్ట్రీ బాగానే వైరల్ అయింది.

మధ్యలో షణ్ముఖ్..

మధ్యలో షణ్ముఖ్..

తనీష్ అంత క్లోజ్‌గా ఉండటంతో దీప్తి సునయన మీద బయట ట్రోలింగ్ నడిచేది. ఎందుకంటే దీప్తి సునయన షణ్ముఖ్‌తో వీడియోలు చేసింది. ఇద్దరూ కలిసి పాటలకు డ్యాన్సులు చేస్తూ బాగానే ఫేమస్ అయ్యారు. అలా ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని టాక్ కూడా నడిచేది. అలా షణ్ముఖ్ వ్యవహారం బిగ్‌బాస్‌లోనూ హాట్ టాపిక్ అయింది.

కౌశల్ అలా అనడంతో..

కౌశల్ అలా అనడంతో..


ఓసారి టాస్క్‌లో భాగంగా కౌశల్‌ను ఆట పట్టించేందుకు దీప్తి సునయన బాగా ఓవర్ యాక్షన్ చేసింది. బిగ్ బాస్ కస్టమర్ కేర్ సెంటర్ అంటూ కౌశల్‌ను ఇష్టమొచ్చినట్టుగా మాటలు అనేసింది. ఆ సమయంలో కౌశల్ షణ్ముఖ్ పేరు తీశాడు. దాంతో సునయన దెబ్బకు ఏడ్చేసింది.

తాజాగా షణ్ముక్ అలా...

తాజాగా షణ్ముక్ అలా...

తాజాగా సుమ క్యాష్ షోలో టిక్ టాక్ స్టార్స్, యూట్యూబ్ స్టార్లను తీసుకొచ్చింది. టిక్ టాక్‌లో భాగంగా దుర్గారావ్ జంటను, భాను జంటను పిలిచింది. ఇక యూట్యూబ్ స్టార్లలో షణ్ముఖ్ జంటను, పక్కింటి కుర్రాడు ఫేం చందు జంటను పిలిచింది. ఇందులో షణ్ముఖ్ ఓ సందర్భంలో అడ్డంగా బుక్కయ్యాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ప్లాన్ ప్రకారమే Gangavva ను హౌస్ నుంచి పంపేసిన Bigg Boss !
ఇద్దరు గొప్ప నటులే..

ఇద్దరు గొప్ప నటులే..

వైష్ణవి , దీప్తి సునయలో ఎవరు ఎక్స్‌ప్రెషన్స్ ఎవరు ఇస్తారు.. అని సుమ వేసిన ప్రశ్నకు ఇరుక్కుపోయాడు. సుమ అలా ప్రశ్న వేయడంతో ‘నేను మాత్రం నెక్స్ట్ వీడియో చేయను' అని వైష్ణవి బెదిరిచింది. మనం ఎలాగూ ఫ్రెండ్స్ కాబట్టి.. నువ్ ఫీల్ అవ్వవు.. ఇద్దరు గొప్ప నటులే.. కాబట్టి ఆన్సర్ దీప్తి అని షణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వెంటనే సుమ అందుకుని వైష్ణవి ఫ్రెండ్ అయితే దీప్తి ఏంటి? అంటూ ఇరుకున పెట్టేసింది. దీంతో షణ్ముఖ్‌కు ఏం చెప్పాలో అర్థం కాక సిగ్గుపడిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X