రాజీవ్ కనకాల రాకపోవడంతో డిప్రెషన్.. యాంకర్ సుమ కామెంట్స్
యాంకర్ సుమ బుల్లితెరపై వేసే పంచ్‌ల గురించి అందరికీ తెలిసిందే. స్టార్ మహిళా, స్టార్ట్ మ్యూజిక్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్, క్యాష్ ఇలా ఏ షో అయినా సరే సుమ చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ మధ్యే స్టార్ట్ మ్యూజిక్ షోను తన భుజాన వేసుకుంది సుమ. అయితే అంతకు ముందు ఝాన్సీ, శ్రీముఖి వంటి వారు ఆ షోను నడిపించారు. అప్పుడు అంతగా వర్కవుట్ అవ్వలేదు. సుమ రంగంలోకి దిగాన షో బాగానే క్లిక్ అయింది.

స్పెషల్ గెస్ట్‌లతో..
యాంకర్ సుమ గెస్ట్‌లతో చేసే హంగామా, వారిపై వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. వచ్చిన గెస్ట్‌లు సుమ మీద పంచ్‌లు వేసినా కూడా వెంటనే వాటిని కవర్ చేసేస్తుంటుంది. సమయస్ఫూర్తితో సుమ వేసే పంచ్‌లు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఒకే సీరియల్‌లో నటించి రియల్ జంటలుగా మారిన వారిని షొలోకి తీసుకొచ్చింది.

ఆ సీరియల్స్‌తో..
చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. ఆ సీరియల్స్ ఇంద్రనీల్ వర్మ, మేఘన, మధు, శ్రుతి ఎంతగానో ఫేమస్ అయ్యారు. రియల్ లైఫ్‌లోనూ ఇంద్రనీల్ మేఘన, మధు శ్రుతిలు ఒక్కటయ్యారు. ఇక హరిత, జాకీలు కూడా సీరియల్స్‌లో జంటగా నటించి నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు.

రచ్చ రచ్చ..
ఇక ఇలా రీల్ జంటలు కాస్త రియల్ జంటలుగా మారిన వాళ్లని సుమ తన షో కోసం తీసుకొచ్చింది. వీరితో సుమ ఓ ఆట ఆడించింది. అయితే ఈ క్రమంలో తమ భర్తలను భార్యలు చితకబాదారు. ఇదే క్రమంలో సుమ ఓ కామెంట్ చేసింది.

రాజీవ్ లేనందుకు డిప్రెషన్..
అయితే అలా తమ భర్తలను భార్యలు బాదటం చూసి సుమ కాస్త ఫీలైంది. తన భర్త రాజీవ్ కనకాల లేనందుకు, ఇది మిస్ అయినందుకు తాను డిప్రెస్డ్‌గా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి సుమ తన మనసులో ఉన్నది బయటపెట్టేసింది.


Click it and Unblock the Notifications











