యాంకర్ సుమ మళ్లీ తెరపైకి.. టాప్ యాంకర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో అలాగే బుల్లితెర ప్రపంచంలో కూడా అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్ ఎవరు అంటే అందరి మనసులో మొదట సుమ పేరే వస్తుంది. ఇండస్ట్రీలో సుమ తో పాటు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే దాదాపు అందరు కూడా ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ కామెంట్స్ అందుకున్న వారే. కానీ సుమ యాంకరింగ్ చేస్తే మాత్రం అసలు నెగిటివ్ కామెంట్స్ అనేవి కూడా పెద్దగా కనిపించవు. ఆమె చాలా పాజిటివ్ గా ఎలాంటి ఈవెంట్ ను అయినా సరే సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆమె సినిమాలోకి కూడా త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గతంలోనే ఒక టాక్ వచ్చింది. ఫైనల్ గా సుమ వెండితెర రీ ఎంట్రీ పై మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.

 కాంట్రవర్సీ లేకుండా..

కాంట్రవర్సీ లేకుండా..

యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర ప్రపంచంలో ఆమె ఎలాంటి షో చేసినా కూడా భారీ స్థాయిలో రేటింగ్ అందుకుంటుంది. కాంట్రవర్సీ లేకుండా అలాగే డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా పెద్దగా లేకుండా చూసుకుంటూ ఉంటారు. వీలైనంతవరకు ప్రేక్షకులకు మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ ను అందించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 కాంట్రవర్సీ లేకుండా..

కాంట్రవర్సీ లేకుండా..

యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర ప్రపంచంలో ఆమె ఎలాంటి షో చేసినా కూడా భారీ స్థాయిలో రేటింగ్ అందుకుంటుంది. కాంట్రవర్సీ లేకుండా అలాగే డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా పెద్దగా లేకుండా చూసుకుంటూ ఉంటారు. వీలైనంతవరకు ప్రేక్షకులకు మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ ను అందించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సుమ ఉంటే.. పాజిటివ్ వైబ్రేషన్

సుమ ఉంటే.. పాజిటివ్ వైబ్రేషన్

ఇక వీలైనంత వరకు తెలుగు చిత్ర పరిశ్రమ జరిగే ఎక్కువ శాతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమెనే దర్శనమిస్తూ ఉంటారు. యువ హీరోల నుంచి సీరియల్ స్టార్ హీరోల వరకు కూడా చాలా మంది వారి ఈవెంట్స్ లో సుమ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. మరి కొందరు అయితే సుమ డేట్స్ అనుకూలంగా ఉన్న సమయంలోనే ఈవెంట్స్ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సుమ సినిమా వేడుకల్లో ఉంటే తెలియని పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

మొదట హీరోయిన్ గా..

మొదట హీరోయిన్ గా..

సుమ యాంకర్ అవ్వకముందు మొదట హీరోయిన్ గా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు 1996లో సుమ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. వర్షం సినిమాలో ప్రభాస్ సోదరిగా కూడా ఒక చిన్న సన్నివేశంలో ఆకట్టుకుంది. యాంకర్ గా మారిన తర్వాత మళ్లీ ఆమె సినిమాల వైపు చూడలేదు.

గతంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ..

గతంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ..

ప్రస్తుతం 6 రియాల్టీ షోలు 3 సినిమా ఈవెంట్స్ అదేవిధంగా సుమారు కెరీర్ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే సుమకు గతంలో చాలా సినిమాలలో ఆఫర్స్ అయితే వచ్చాయి. కానీ నిత్యం రియాలిటీ షోలతో అలాగే ఈవెంట్స్ లలో బిజీగా ఉండటం వలన వెండితెర వైపు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయింది. అయితే ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికి కూడా సుమ త్వరలోనే వెండితెరపై కనిపించబోతోంది అని చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి.

స్పెషల్ వీడియో రిలీజ్

సుమ రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదట. అయితే ఈసారి అలాంటి రూమర్స్ కు పెద్దగా తావు ఇవ్వకుండానే తనే ఒక క్లారిటీ ఇచ్చేసింది. త్వరలోనే కొత్త సినిమాతో రాబోతున్నట్లు వివరణ ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా పోస్ట్ చేస్తూ అందులో ప్రతి ఒక్కరు కూడా సుమ సినిమాల్లోకి రాబోతోంది కదా అని అడగడం కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా మంది హీరోలు కూడా సుమ సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అనే విషయాలను కూడా అందులో హైలెట్ చేశారు.

Recommended Video

Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
రెమ్యునరేషన్ కోట్లల్లోనే..

రెమ్యునరేషన్ కోట్లల్లోనే..

అంతేకాకుండా వీడియోలో సుమ రెమ్యూనరేషన్ ఎంత అని అడగగా కోట్లల్లోనే ఉంటుంది అని మరొక సమాధానం వచ్చింది. అయితే ట్రై చేయొచ్చు ఏమో అని కూడా సుమ సమాధానమిచ్చింది. త్వరలోనే మరిన్ని వివరాలను కూడా చెప్పబోతున్నట్లు తెలియజేశారు. ఇక ప్రస్తుతం సుమారు ఒక షోకు అలాగే ఒక రోజు జరిగే ఈవెంట్ కు దాదాపు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయల మధ్యలో చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాల్లో నటిస్తే ఆమె ఏ స్థాయిలో డిమాండ్ చేస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X