Suma Kanakala: సుమ షోకి నైట్ డ్రెస్సులో వచ్చిన ప్రముఖ సింగర్... ఇదేం అరాచకం!
యాంకర్ సుమ షో అంటే మామూలుగా ఉండదు. అల్టీమేట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా. ఇక సుమ నిర్వహిస్తున్న షోల్లో సుమ అడ్డా ఒకటి. ఇక తాజాగా ఉగాది స్పెషల్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అయితే అందులో ప్రముఖ సింగర్స్ గెస్టులుగా హాజరై సందడి చేశారు. వారి కామెడీ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఓ ప్రముఖ సింగర్ నైట్ డ్రెస్సులో షోకి రావడం... నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఏంటండీ ఈ అరాచకం అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది కామెడీ అంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. అసలు ఏం జరిగిందో..ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సుమ కనకాల షోస్ అల్టీమేట్...:సుమ కనకాల యాంకర్ గా వ్యవహారిస్తున్న షో సుమ అడ్డ. ప్రముఖ ఈటీవీ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం ఉగాది స్పెషల్ ప్రోమో రిలీజ్ అయింది. దీనికి యూట్యూబ్ లో మంచి స్పందన వస్తుంది. ఇక ఈ షోకు ప్రముఖ సింగర్స్ మనో, మనీషా, రఘు కుంచె, కల్పనా గెస్టులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొని నవ్వులు పూయించారు. ప్రేక్షకులను తమ పంచులతో ఎంటర్టైన్ చేశారు. ఉగాది పర్వదినం కానుకగా ఈ టెలికాస్ట్ కానుంది.

యాంకర్ సుమ నైట్ డ్రెస్సా అంటూ కామెడీ...:ఇక ప్రోమోలో రఘు కుంచె ఎంట్రీ తర్వాత ఉగాది రోజున ట్రెడిషనల్ గా రమ్మని చెప్పారు.. మరి ఆయనేంటి( మను) పూల చొక్కా వేసుకుని పూల రంగడులా వచ్చాడు అంటూ కామెంట్ చేస్తాడు. సింగర్ మనును ఉద్దేశించి రఘు కుంచె మాట్లాడగా.. వెంటనే మను మాట్లాడుతూ.. నేను నైట్ టైం ఇట్లాంటి డ్రెస్ వేసుకుని పడుకోవడం అలవాటు అంటూ చెప్పుకువస్తాడు. వెంటనే సుమ అంటే ఇది నైట్ డ్రెస్సా అంటూ కామెంట్ చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వుతారు.
మను, రఘు కుంచె కలిసి ఎంటర్టైన్...:ఇక ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్.. నైట్ డ్రెస్సులోనే మను షోకి వచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ప్రోమోలో సుమ, మను మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది. స్పాంటెనియస్ గా సుమ, మను తమ పంచులతో అలరించారు. రఘు కుంచె కూడా మను మీద సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఇక మను, రఘు కుంచె కలిసి దళపతి సినిమాలోని బంధాలైనా చుట్టులైనా అనే పాటకు డ్యాన్స్ వేశారు.
అన్ లిమిటెడ్ ఫన్ కామెడీ షో...:ఇక ఈ షోలో పలు కామెడీ ట్రాక్స్ తో పాటు పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. మీరు ఈ ప్రోమోను చూసి మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఈ అన్ లిమిటెడ్ ఫన్ కామెడీ షోను మీరు చూడాలంటే.. ఈ శనివారం రాత్రి 9 గంటలకు ఈటీవీ ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











