twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేతులెత్తేసిన అనసూయ, సుమ.. ఇక ఆ షోలకు బ్రేక్ పడినట్లే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ఇప్పటికే సినిమా షూటింగ్స్ మొదలుపెట్టారు. ఇక మరికొందరు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఎండ్ కార్డ్ పెట్టేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా టెలివిజన్ షోలకు కూడా కాస్త బ్రేక్ పడింది. కరోనా వైరస్ విలయతాండవం చూసి స్టార్స్ బయటకు రావడానికి ధైర్యం చేయడం లేదు. ఇక టాప్ యాంకర్స్ కూడా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో సుమ, అనసూయ.భరద్వాజ్ కూడా ఉన్నారు.

    కరోనా దెబ్బకు..

    కరోనా దెబ్బకు..

    కరోనా దెబ్బకు ఒక్కసారిగా బుల్లితెర రియాలిటీ షోలకు ఉహీంచని దెబ్బ పడింది. నిత్యం బిజీ బిజీగా ఉండే టీవీ ఆర్టిస్టులు వైరస్ కారణంగా చాలానే నష్టపోయారు. షోలు, షూటింగ్స్ లేక కొందరు ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నారు. ఇక లాక్ డౌన్ ఎత్తివేయగానే కొందరు షూటింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఎవరికి వారే సొంతంగా షూటింగ్స్ కి దురమవుతున్నట్లు తెలుస్తోంది.

     సుమ, అనసూయ షాకింగ్ డిసిషన్

    సుమ, అనసూయ షాకింగ్ డిసిషన్

    లాక్ డౌన్ ఎత్తివేయగానే అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షోని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు సుమ కనకాల కూడా క్యాష్ వంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి డేరింగ్ యాంకర్ అని నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం వలన మళ్ళీ వెనుకడుగు వేస్తున్నట్లు టాక్ వస్తోంది. కరోనా వైరస్ ఎక్కువగా షూటింగ్స్ లలోనే వ్యాప్తి చెందుతోందని ఓ వర్గం వారికి బాగా తెలిసొచ్చింది.

    కొన్నాళ్ళు దూరంగానే..

    కొన్నాళ్ళు దూరంగానే..

    ఇప్పటికే కొంత మంది టీవీ ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి ఇష్టపడని స్టార్ యాంకర్స్ సుమ, అనసూయ షూటింగ్స్ కి వెళ్లి రిస్క్ లో పడటం కంటే కొన్నాళ్ళు దూరంగానే ఉంటేనే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎంత ఇస్తామని అన్నా కూడా కరోనా తగ్గే వరకు రిస్క్ చేయలేమని ఇప్పటికే ఓ వర్గం నటీనటులు బలమైన నిర్ణయం తీసుకున్నారు.

    సుమ యూట్యూబ్ ప్లాన్..

    సుమ యూట్యూబ్ ప్లాన్..

    ఇక సుమ, అనసూయ వంటి వారు కూడా అదే తరహాలో ఎలాంటి షోలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. గతంలో యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా జనాలని ఆకర్షించాలని సుమ కనకాల మరొక కొత్త తరహా కామెడీ స్కిట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Tollywood's number one anchor is Suma Kanakala. What started as a career as anchor has received more craze than Star Actors. Powerful in terms of extracting the suma people who currently dominate the Hot Anchors. Recently, a shocking rumor came over suma, who has been busy anchoring TV shows and pre-rock events.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X