twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే ఫ్రేమ్‌లో వంటలక్క-సుమక్క.. అక్కడేం చేస్తున్నారంటే.. ఇక వ్యవహారం అలా వేడెక్కింది!!

    |

    రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై వంటలక్క, సుమక్క అని పేరు వినని, తెలియని ప్రేక్షకులు వినని వారెవ్వరూ ఉండరు. ఒకరు బుల్లితెరపై కామెడీని పండిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇంకొకరు కార్తీక దీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయింది. బుల్లితెరపై సుమ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. కార్తీక దీపం ద్వారా ప్రేమీ విశ్వనాథ్ అన్ని రికార్డులు క్రియేట్ చేసింది. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ తెలుగు మహిళా లోకాన్ని కట్టిపడేసింది. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

    కార్తీక దీపంతో అలా..

    కార్తీక దీపంతో అలా..

    కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ అందులో వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్‌కు వచ్చిన పాపులార్టీ గురించి అందరికీ తెలిసిందే. ఒక్క కార్తీక దీపం సీరియల్‌తో స్టార్ హీరోయిన్లకు కూడా రాని ఫాలోయింగ్ ఆమె సొంతమైంది. ఆమె నటన, యాటిట్యూబ్, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచే ఆమె కట్టుబొట్టూ ఇలా ప్రతీ ఒక్కటి అందరి గుండెల్లో ముద్రను వేశాయి.

     బుల్లితెర మహారాణి..

    బుల్లితెర మహారాణి..

    ఇక సుమ గురించి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. కొన్నేళ్ల నుంచి బుల్లితెరను ఏక ఛత్రాదిపత్యంగా ఏలేస్తోంది. యాంకరింగ్‌లో సుమ దశాబ్దానికి పైగా టాప్ ప్లేస్‌లో దూసుకుపోతూనే ఉంది. స్టార్ మహిళ అనే కార్యక్రమంతో ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కింది. ఇన్ని రోజులు బుల్లితెర,సినిమా ఈవెంట్లలో సందడి చేసిన సుమ.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

    ఇద్దరూ కలిసి..

    ఇద్దరూ కలిసి..

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్డేట్స్, పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేస్తూ ఉండే సుమ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో వంటలక్కతో కలిసి సుమ అదిరిపోయే పోజిచ్చింది. ఆ ఇద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు.. కీప్ గెస్సింగ్ అంటూ ఓ ప్రశ్నను వదిలింది. దీంతో వ్యవహారం మొత్తం వేడెక్కింది. ఇక నెటిజన్లు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
     అందుకే అలా..

    అందుకే అలా..

    వంటలక్క దగ్గర సుమ వంటలు నేర్చుకుంటుందేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు మళయాలీలు కలిసి ఏదో ముచ్చట్లు పెడుతున్నారు? అసలు వంటలక్క అని చెబుతుంది కానీ వండటం వచ్చా? అని సుమ ఆలోచిస్తోందనిని ఇంకొందరు కామెంట్లుచేస్తున్నారు. ఉలవచారు రెస్టారెంట్‌లో ఏదో ఈవెంట్ ఉండి ఉంటుంది.. అందుకే ఇద్దరూ గెస్ట్‌లుగా వెళ్లారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    anchor suma and premi viswanath pic goes viral, What are these two doing ???? Keep guessing,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X