Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ ఒక్క మూమెంట్‌తో కన్నీరుమున్నీరు.. రాజీవ్ కనకాల, సుమ కంటతడి
బుల్లితెరపై ఈ మధ్య షోలు బాగా సక్సెస్ కావాలంటే ఎమోషన్‌ను బాగా పండించాలనే సూత్రాన్ని పట్టుకున్నారు. ఏదో ఒకటి కొత్తగా ఉండటం, లేదా స్టేజ్ మీదే కన్నీరు పెట్టించేలా వారి గతం గుర్తుకు వచ్చేలా చేయడం, లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లను బాగా ఎంకరేజ్ చేయడమనేది ఓ ఫార్మూలాగా పెట్టుకున్నట్టున్నారు. తాజాగా సుమ నిర్వహిస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలోనూ అలానే జరుగుతోంది.

సెలెబ్రిటీలతో ఆట..
సుమ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్‌ను ఎంత పైకి లేపుదామని ప్రయత్నించినా కుదరడం లేదు. మంచి మంచి గెస్ట్‌లను పట్టుకొస్తున్నా కూడా రేటింగ్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే కౌశల్, రాహుల్, అలీ, బ్రహ్మాజీ, సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారిని తీసుకొచ్చింది. వారితో ఆటలు ఆడించింది.. వారిపైనే ప్రయోగాలు చేయించింది. కానీ రేటింగ్స్ మాత్రం రాబట్టలేకపోతోంది.

యాంకర్ రవిపైనా సెటైర్లు..
ఇక షో మధ్యలో యాంకర్ రవిపైనే సెటైర్లు బాగానే వేస్తుంటుంది. అలా రవి, సుమ కాంబో కూడా బాగానే కష్టపడుతోంది. కానీ తేడా ఎక్కడ కొడుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరైన రేటింగ్స్ రాకపోవడంతో టీం మొత్తం ఆలోచనలో పడిందని తెలుస్తోంది.

అందుకే ఇలా..
ఇక రేటింగ్ పెంచే దిశగా రాజీవ్ కనకాల, సుమతో మంచి ప్లాన్ వేశారు. మామూలుగా అయితే సుమ హోస్ట్ చేసే షోల్లో రాజీవ్ కనకాల అప్పుడప్పుడు అలా మెరుస్తుంటాడు. ఆ మధ్య స్టార్ మహిళ మంచి ఊపులో ఉన్న సమయంలో రాజీవ్ వచ్చి సందడి చేశాడు. ఇక క్యాష్‌లో అయితే ఎన్నో సార్లు రచ్చ చేశాడు.

ఇప్పుడు ఇలా..
తాజాగా ఇప్పుడు రాజీవ్ కనకాల సుమ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో గెస్ట్‌గా వచ్చాడు. అలా అతిథులుగా వచ్చిన గెస్ట్‌లకు ఓ సర్ ప్రైజ్ ఇస్తుంటుంది సుమ. కంటెస్టెంట్లు చేసే మాయాజాలంలో పార్టిసిపేట్ చేయించేలా ప్లాన్ చేస్తుంది. అలా సమ ఈ సారి రాజీవ్ కనకాలను ముందు పెట్టింది.
Recommended Video

ఇద్దరూ కంటతడి..
షోలో భాగంగా ఓ మెజిషీయన్ రాజీవ్ కనకాల కళ్లకు గంతలు కట్టాడు. రాజీవ్ చేత్తో తన తండ్రి దేవదాస్ కనకాల బొమ్మను గీయించాడు. అలా తన తండ్రి చిత్రపటాన్ని చూసి రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యాడు. రాజీవ్, సుమ ఇద్దరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టేసుకున్నారు.