యాక్టర్‌ను బడితతో చితకబాదిన యాంకర్ సుమ.. వెంటపడి తరుముతూ..
తెలుగు వినోద పరిశ్రమలో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న యాంకర్ సుమకు ఎదురే లేకుండా పోతున్నది. సినిమా ఫంక్షన్లకు , టెలివిజన్ రియాలిటీ షోలకు హోస్ట్‌గా బిజీగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె నిర్వహించే స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమంలో సమీర్, జబర్దస్త్ చంటీతో చేసిన హంగామ ఎలా ఉందంటే..

స్టార్ట్ మ్యూజిక్ షోతో సుమ
యాంకర్ సుమ విషయానికి వస్తే.. తెలుగు టెలివిజన్ రంగంలోని అన్ని ప్రధాన ఛానెల్స్‌లో తన ప్రతిభతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఈటీవీ, స్టార్ మా, జెమినీ లాంటి ఛానెల్స్‌లో గేమ్ షోలు, రియాలిటీ షోలను సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు. తాజాగా స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరింతగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

స్టార్ కమెడియన్లతో లేటేస్ట్ ఎపిసోడ్
స్టార్ట్ మ్యూజిక్ తాజా ఎపిసోడ్‌లో నటుడు సమీర్, జబర్దస్త్ ఫేం చలాకీ చంటి, నల్లవేణు, ధన్ రాజ్, జ్యోతి తదితరులు హాజరయ్యారు. ఇక ఇలాంటి ముదుర్లు కలిస్తే హస్యం ఎలా పండుతుందో మాటల్లో చెప్పనక్కర్లేదు. సమీర్ వేసిన పంచ్ డైలాగ్స్ చెలరేగిన సుమ.. సమీర్‌ను వెంటాడి గట్టిగానే బాదింది.

పాటలు పాడుతూ సమీర్ రచ్చ
మ్యూజిక్ ఆధారంగా సాగే స్టార్ మ్యూజిక్ ఈ కార్యక్రమంలో సమీర్ హంగామా భారీగానే కనిపించింది. తన సాధ్యం కానీ పరిస్థితుల్లో పాటలు పాడుతూ రచ్చ రచ్చ చేశారు. గానంతో సమీర్ చేస్తున్న హింసను భరించలేక అందరూ తల్లడిల్లిపోయారు. సమ ఆయన గోలను భరించలేనంటూ ఫోజ్ పెట్టిసింది. అయినా సమీర్ తన హంగామాను అలాగే కొనసాగించారు.

సమీర్‌ను వెంటాడి కొట్టిన సుమ
స్టార్ మ్యూజిక్‌లో తాజా ఎపిసోడ్‌లో భాగంగా.. రాత్రి పది గంటలకు, మొగుడు కొట్టిన దెబ్బలకు, ఆస్పత్రి ఖర్చులకు అంటూ సమీర్ ఆవేశంగా స్పీచ్ దంచేస్తుంటే.. యాంకర్ సుమ తట్టుకోలేకోపోయింది. దాంతో వెంటపడి ఆయను పిరుదలపై చావ బాదే ప్రయత్నం చేసింది.

చలాకీ చంటికి కూడా సుమ ఝలక్
ఇంతలో చందమామ రావే అంటూ చలాకీ చంటీ పాట అందుకొంటే ఏదో సైగ చేయబోయాడు. ఏంటి చంటీ.. రమ్మని అలాగా సైగ చేస్తారా అంటూ సుమ నిలదీసింది. దాంతో రావొద్దనే విధంగా సైగ చేస్తూ.. ఇలాగే మా ఇంట్లో పిలుస్తారు అంటూ సుమకు సమాధానం ఇచ్చాడు. అయితే ఈ అల్లరికి అసలు కారణమేమిటో తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారయ్యే ఎపిసోడ్ చూస్తే అసలు విషయం తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











