ఈ వయసులో నీకు అవసరమా? నెటిజన్ ప్రశ్నకు యాంకర్ సుమ దిమ్మతిరిగే జవాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ సుమ స్థానాన్ని మాత్రం ఎవరు బీట్ చేయలేరనే చెప్పాలి. ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగులో మాట్లాడుతూ, తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఒకప్పుడు బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే సుమ ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లతోనే బిజీగా గడుపుతున్నారు. సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమా ఆ కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..

Anchor Suma befitting reply to netizens question on her Workout Video which is goes Trending

సోషల్ మీడియాలో తరచూ తన స్టాప్ తో కలిసి చేసే వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇక సుమా వయసు పైబడుతున్న ఎంతో యంగ్ గా కనిపిస్తూనే యాక్టివ్ గా ఉంటారు అయితే సుమ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా పులిహోర, గారెలు తిని పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం ప్రాయశ్చిత్తం అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

ఇక ఈ వీడియోలో సుమ తెగ కష్టపడుతూ రోప్ మూమెంట్ చేస్తూ ఉన్న వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై కొంతమంది నెటిజెన్స్ స్పందిస్తూ సుమ గారు మీకు ఎలా వస్తాయండీ ఇలాంటి ఐడియాలు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ వీడియో పై మరికొంతమంది నేటి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ముసలి దానా ఆపు నీ సోది అంటూ దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇలా ఒక నెటిజన్ చేసిన ఈ కామెంట్ పై మరి కొంతమంది నేటిజన్స్ స్పందిస్తూ.. మీరు కలకాలం చాలా యంగ్ గానే ఉంటారా అంటూ కామెంట్ చేయగా మరొక నేటిజన్ మన్మధుడు మీరు భూలోకానికి ఎప్పుడు వచ్చారు అంటూ నేటిజన్స్ చేసినటువంటి కామెంట్ కు మరికొందరు ఘాటుగానే సమాధానం చెప్పారు.

ఇక ఇటీవల జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో హీరోయిన్స్ కంటే మీరే అందంగా ఉన్నారు సుమ గారు అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సుమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X