For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Suma: టైటానిక్ రేంజ్ లో భర్తతో రొమాంటిక్ గా సుమ.. వీడియో వైరల్..

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా చాలా ఎక్కువ బిజీగా కనిపించే యాంకర్స్ లలో సుమా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటివరకు అత్యధిక రియాలిటీ షోలు సినిమా ఈవెంట్స్ కు హోస్ట్ వ్యవహరించిన వారిలో కూడా ఆమె నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సుమ పర్సనల్ లైఫ్ తో కూడా అప్పుడప్పుడు చాలా జాలిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో స్వీట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి..

  హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి..

  యాంకర్ సుమను ఇప్పటికి కూడా చాలామంది తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. కానీ ఆమె పుట్టింది పెరిగింది కేరళలో అని చాలామందికి తెలియదు. టెలివిజన్ నటిగా అనుకోకుండా ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదట కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించాలని అనుకుంది. కానీ అటువైపుగా ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ టెలివిజన్ ప్రపంచంలో కొన్ని సీరియల్స్ లో నటించింది.

  ప్రేమ వివాహం

  ప్రేమ వివాహం

  ఇక సినిమా యాక్టర్ గా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసిన సుమ రాజీవ్ కనకాల తో పరిచయమైన తర్వాత అతనితో ప్రేమలో పడింది. ఇక వారిద్దరు కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. నటుడిగా రాజీవ్ కనకాల కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

  అందులో నిజం లేదు

  అందులో నిజం లేదు

  అయితే గతంలో ఒకసారి రాజీవ్ కనకాల సుమ మధ్యలో కొంత విభేదాలు వచ్చాయని రాజీవ్ కనకాల భార్య నుంచి విడిపోయి మరొక ఫ్లాట్లో ఉంటున్నాడు అని కూడా కొంత టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మా నాన్నగారి ప్లాట్ లో ఉంటే కూడా అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు అని నా భార్యను చూసి నేనెప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతాను అని వివరణ ఇచ్చారు.

   ఫ్యామిలీ లైఫ్

  ఫ్యామిలీ లైఫ్

  ఇక సుమ యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ కోసం కూడా ఆమె కొంత టైం కేటాయిస్తూ ఉంటారు. ఆమె ఒక కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు రోషన్ ప్రస్తుతం హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ప్రతి ఫెస్టివల్ ను కూడా సుమ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది.

  టైటానిక్ లవర్స్ తరహాలో

  ఇక రీసెంట్ గా రాజీవ్ కనకాల పుట్టినరోజు కావడంతో ఇంట్లోనే స్పెషల్ గా కేక్ కట్ చేయించారు. అంతేకాకుండా గోదావరి తీరంలో కూడా వారిద్దరూ కలిసి ఆనందంగా తిరిగినట్లున్న ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియోలో రాజీవ్ కనకాల సుమ ఇద్దరు కూడా టైటానిక్ లవర్స్ తరహాలో స్టిల్ ఇచ్చిన విధానం ఎంతగానో హైలెట్ అయింది. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో మరోసారి ఈ వీడియో ద్వారా అర్థం అయింది.

  English summary
  Anchor suma celebrated rajiv kanakala birthday in romantic way
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X