For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Suma Remuneration: సుమ రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఎపిసోడ్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సంచలన రికార్డు!

  |

  'తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ, నన్ను కొట్టేవాళ్లే లేరు' అన్నట్లుగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది సీనియర్ యాంకర్ సుమ కనకాల. హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనదైన వాక్చాతుర్యంతో స్టార్‌గా ఎదిగిన ఈమె.. వరుస షోలతో సత్తా చాటుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే సుమ ఇప్పుడు 'సుమ అడ్డా' అనే కొత్త షోతో వచ్చింది. ఇక, ఈ షోకు గానూ ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసమే!

  బుల్లితెరపై హవాను చూపిస్తూ

  బుల్లితెరపై హవాను చూపిస్తూ

  బుల్లితెర చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా సుమ.. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  ఇక్కడే కాదు... అక్కడ కూడా

  ఇక్కడే కాదు... అక్కడ కూడా

  తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్‌గా ఉన్న సుమ.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. సుమ వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతోంది.

  క్యాష్ స్థానంలో ‘సుమ అడ్డా'

  క్యాష్ స్థానంలో ‘సుమ అడ్డా'

  సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అలాంటిది ఈ షోను ఇటీవలే నిలిపేశారు. దీని స్థానంలో 'సుమ అడ్డా' అనే షోతో సుమ వచ్చేసింది.

  జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

  మొదలైంది.. చిరంజీవి కూడా

  మొదలైంది.. చిరంజీవి కూడా

  తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తూ సుమ కనకాల ఇప్పుడు 'సుమ అడ్డా' అనే కొత్త షోతో వచ్చింది. జనవరి 7వ తేదీ నుంచి ప్రతి శనివారం ప్రసారం కాబోతున్న దీనికి ఫస్ట్ ఎపిసోడ్‌లో సంతోష్ శోభన్ 'కల్యాణం కమనీయం' టీమ్ సందడి చేసింది. దీని తర్వాత ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో కలిసి వచ్చినట్లు తెలిసింది.

  మొదటి నుంచీ ఎక్కువగానే

  మొదటి నుంచీ ఎక్కువగానే

  బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న యాంకర్ సుమ.. అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్‌కు మిగిలిన లేడీ యాంకర్ల కంటే ఈమె దాదాపు యాభై వేల రూపాయలు ఎక్కవగా చార్జ్ చేస్తుందన్న టాక్ ఉంది. ఇలా కూడా సుదీర్ఘ కాలంగా సుమ ప్రత్యేకతను చాటుకుంటోంది.

  49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

  సుమ అడ్డాకు చార్జ్ ఎంత?

  సుమ అడ్డాకు చార్జ్ ఎంత?

  ప్రస్తుతం హోస్ట్ చేస్తోన్న 'సుమ అడ్డా' షోకు సుమ కనకాల ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 1.60 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందట. అంటే.. నెలకు దాదాపుగా రూ. 6.40 లక్షలు చార్జ్ చేస్తోంది. గతంలో 'క్యాష్' షోకు మాత్రం రూ. 1.20 లక్షలే తీసుకుందట.

  సుమ మరో సంచలన రికార్డు

  సుమ మరో సంచలన రికార్డు

  తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అందులో ఎవరూ కూడా ఒక్క ఎపిసోడ్‌కు రూ. 1.50 లక్షల కంటే ఎక్కువ మొత్తం తీసుకోలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు 'సుమ అడ్డా' షో రెమ్యూనరేషన్ ద్వారా యాంకర్ సుమ కనకాల సంచలన రికార్డును నమోదు చేసిందని అంటున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది.

  English summary
  Anchor Suma Started Suma Adda Show in ETV From January 7th. This Star Anchor Charges Huge Remuneration for This Game Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X