చెడ్డీలు లేకున్నా ఫర్వాలేదు.. మాస్కులు లేకపోతే ఇక అంతే.. సుమ పంచులు అదరహో..
టాలీవుడ్‌లోను, తెలుగు టెలివిజన్ రంగంలోను టాప్ యాంకర్‌గా రాణిస్తున్న యాంకర్ సుమ తనదైన మార్కు హాస్యాన్ని పండిస్తూ వస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేయడంలో సుమను మించిన వారుండరేమో. అలాంటి టాలెంట్ ఉన్న సుమ నిర్వహించే షోలలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కార్యక్రమం స్టార్ట్ మ్యూజిక్. ఈ వారం షోలో తెలుగు తెరపై విశేషంగా రాణిస్తున్న ఇంటింటి గృహలక్ష్మీ, చెల్లెలి కాపురం సీరియల్ నటులు హంగామా లా చేశారంటే. .

పదునైన పంచులతో సుమ
స్టార్ట్ మ్యూజిక్ షో ఆరంభంలోనే యాంకర్ సుమ పదునైన పంచులతో ఆలరించారు. చెల్లెలి కాపురం వాళ్ల దుమ్ము దులుపుతా అంటూ అని అన్నారని హంగామా చేశారు. అలాగే ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు ముద్దుల పోటీ పెట్టారు. ఓ పలకలాంటి వస్తువును ఇచ్చి ముద్దులు పెట్టుకోమన్నారు.

మసక మసకగా ముద్దులు
అయితే సుమ ఇచ్చిన టాస్క్‌ను ఈ రెండు సీరియల్స్ నటులు పోటీ పడి చేశారు. అయితే పలకల మీద ముద్దులు మసక మసకగా ఉన్నాయేంటి అంటూ సుమ ప్రశ్నించగా, అవి చీకట్లో పెట్టాం అంటూ సెలబ్రీటీలు కామెంట్ చేశారు. ఇలా షోలో అల్లరి జోరుగా సాగింది.

చెడ్డీలు వేసుకొన్నా.. లేకపోయినా ..
అలాగే రెండు సీరియల్స్ సభ్యులతో రకరకాల గేమ్స్ ఆడించింది. స్కూల్ పిల్లల్ల మాదిరిగా ట్రీట్ చేస్తూ వారితో గేమ్ ఆడించింది. అయితే మాస్క్ పెట్టుకోకుండా కనిపించిన వారిని శిక్షిస్తూ.. చెడ్డీలు వేసుకున్నా లేకపోయినా పర్వాలేదు. కానీ మాస్క్ వేసుకొని రావాలని చెప్పానుగా అంటూ వార్నింగ్ ఇస్తూ కనిపించింది.
Recommended Video
స్టార్ట్ మ్యూజిక్‌లో సుమ హంగామా
ఇలా స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమంలో సుమ, ఇతర సెలబ్రీటలు ఫుల్లుగా వినోదాన్ని పండించారు. సున్నితమైన హాస్యం, పంచులతో ఈ కార్యక్రమం ఘాటుగా కొనసాగుతున్నది. ఈ అంశాలకు సుమ యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్‌లోనే ఇంత హంగామా ఉంటే.. ఫుల్ ఎపిసోడ్ ఫుల్ మీల్స్‌లా వినోదాన్ని పండిస్తుందేమో..


Click it and Unblock the Notifications











