బాలకృష్ణ జోలికి వెళ్లక పోతేనే బెటర్.. యాంకర్ సుమ దిమ్మతిరిగే పంచ్
అనధికార లాక్‌డౌన్‌లో వినోదానికి దూరమైన ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి పలు బుల్లితెర ఛానెల్స్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సున్నితమైన హాస్యంతో ఆకట్టుకొంటున్న రియాలిటీ షో స్టార్ట్ మ్యూజిక్. స్టార్ యాంకర్ సుమ హోస్ట్‌గా నిర్వహించిన ఈ షోలో ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ, చెల్లెలి కాపురం సీరియల్ నటులు పాల్గొని అలరించారు. ఈ సందర్భంగా సుమ వేసిన పంచులు వైరల్‌గా మారాయి. ఈ పంచుల వివరాల్లోకి వెళితే..

టీవీ నటులను స్కూల్ పిల్లలుగా మార్చేసి
ప్రస్తుత వారంలో ఇంటింటి గృహలక్ష్మీ, చెల్లెలి కాపురం సీరియల్ నటులతో స్టార్ట్ మ్యూజిక్ షోను మరింత వినోదంగా మార్చింది. సీరియల్ నటులతో ఆటలు ఆడిస్తూ.. పాటలు పాడిస్తూ సందడిగా మార్చారు. ఈ సందర్బంగా నటులను స్కూల్ పిల్లలుగా మార్చేసి వినోదాన్ని పంచారు.

క్లాస్‌లో పిల్లల అటెండెన్స్ తీసుకొంటూ
స్టార్ట్ మ్యూజిక్ షోలో టీచర్‌గా మారిన యాంకర్ సుమ క్లాస్‌లో పిలల్ల అటెండెన్స్ తీసుకొంటూ.. పవన్ కల్యాణ్ గారు అంటే.. ప్రజెంట్ టీచర్ అంటూ ఓ స్టూడెంట్ పలికింది. ఆ తర్వాత బాలకృష్ణ గారు అంటే.. రాలేదు టీచర్.. సినిమాకు వెళ్లారు టీచర్.. ఫర్వాలేదు.. ఆ సినిమాకు వెళితే వెళ్లిండు. ఆయన జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటూ సుమ పంచ్ విసిరారు

సమంతకు పిచ్చ ఫ్యాన్ అంటూ
మరో యాక్టర్‌తో సుమ మాట్లాడుతుండగా ఆయన సమంతకు పిచ్చ ఫ్యాన్ అంటూ తొటి నటుడి గురించి చెప్పింది. దాంతో సమంతను గుర్తు చేస్తే చాలా సిగ్గుపడి పోతాను అని యాక్టర్ అంటే.. అబ్బా.. ఎదురుగా వస్తే ఏమిటి పరిస్థితి? అంటే.. కళ్లు తిరిగి పడిపోతానేమో అంటూ సమాధానం ఇచ్చారు. దాంతో నీవు కళ్లు తిరిగి పడిపోతే నాగచైతన్య నీళ్లు చల్లి లేపుతారులే అంటూ సుమ మరో పంచ్ విసిరారు.

ఉప్పెన పాటకు రొమాంటిక్‌గా
ఆ తర్వాత ఓ టీవీ నటితో ఉప్పెన సాంగ్‌పై రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఆ నటితో సుమ లిప్‌లాక్ చేసినట్టు యాక్టింగ్ చేశారు. దాంతో మరో నటి.. మధ్యాహ్నం పన్నెండు గంటలా? రాత్రి పన్నెండు గంటలా? అనుమానాన్ని వ్యక్తం చేసింది. దాంతో కంటెస్టెంట్లు నవ్వుల్లో మునిగిపోయారు.
Recommended Video

రాత్రి 12 గంటలైతే అంటూ..
దాంతో ఆ నటి మాటలకు స్పందిస్తూ.. మధ్యాహ్నంతో 12 గంటలు కావడంతో ఇంతటితో ఆగిపోయాం. రాత్రి పన్నెండు అయితే ఇక్కడితో ఆగాం లేకపోతే మరో విధంగా ఉండేది అంటూ సుమ పంచ్ వేశారు. ఇలా స్టార్ట్ మ్యూజిక్ షో వినోదంగా, అల్లరి అల్లరిగా సాగింది. సుమ తన యాంకరింగ్‌తో గెస్టులనే కాకుండా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు.


Click it and Unblock the Notifications











