ఎన్టీఆర్ కోసం సుమను వద్దనుకున్న రాజమౌళి ఫ్యామిలీ.. ఇంటర్వ్యూలో నిలదీయడంతో..

ఎవరైనా సరే ఒక స్టార్ హీరో తెలియదు అంటే అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ యాంకర్ సుమ తెలియదు అంటే షాక్ అవ్వాల్సిందే. అంతగా తన క్రేజ్ ను పెంచుకున్న సుమ టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయినటువంటి సుమ ఇటీవల వారికి సంబంధించిన ఈవెంట్ లో కనిపించలేదు. ఒక కారణం వల్ల ఆమెను సెలెక్ట్ చేసుకోలేదట. దీంతో ఇంటర్వ్యూలో సుమ కౌంటర్లు వేస్తూ గట్టిగానే ఆడిగేసింది.

 సుమ ఉంటే ధైర్యంగా..

సుమ ఉంటే ధైర్యంగా..

యాంకర్ సుమ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ లలో ఉంటే చిత్ర యూనిట్ సభ్యులు కాస్త ధైర్యంగా ఉంటారు. ఎలాంటి వేడుక జరిగినా కూడా సుమ తన మాటలతో హావా భావాలతో ముందుగానే జనాలను ఎట్రాక్ట్ చేసి ఈవెంట్ లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అందుకే సుమ ఉంటే ధైర్యంగా ఉండవచ్చని నిర్మాతలు ఆమెను హోస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారు.

రాజమౌళి ఫ్యామిలీతో..

రాజమౌళి ఫ్యామిలీతో..

దాదాపు ప్రతి పెద్ద సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లలో ఆమె హోస్ట్ గా వ్యవహరీంచడం గురించి అందరికి తెలిసిందే. ఇక రాజమౌళి కుటుంబానికి సంబంధించిన పర్సనల్ ప్రొఫెషినల్ ఈవెంట్స్ లలో కూడా సుమ ఉండాల్సిందే. ఆ రెండు కుటుంబాలకు ఎన్నో ఏళ్ళ నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.

హోస్ట్ గా సెలెక్ట్ చేయకపోవడంతో..

హోస్ట్ గా సెలెక్ట్ చేయకపోవడంతో..

అయితే ఇటీవల రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించిన ఒక సినిమా ఈవెంట్ కు ఆమెను హోస్ట్ గా సెలెక్ట్ చేయలేదు. అందుకు కారణం ఎన్టీఆర్ అని తెలిసింది. దీంతో సుమ వారితో ఇంటర్వ్యూ తీసుకొని గట్టిగానే అడిగేసింది. కారణం చెప్పినా కూడా కౌంటర్లు ఆగలేదు. సరదాగా సాగిన ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 వేరే యాంకర్ హోస్ట్ గా..

వేరే యాంకర్ హోస్ట్ గా..

కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటించిన సినిమా తెల్లవారితే గురువారం మార్చి 27న విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగింది. అయితే ఆ ఈవెంట్ కు సుమ కాకుండా వేరేవాళ్ళు హోస్ట్ గా సెలెక్ట్ చేశారు.

నేను లేకుండా ఎలా చేస్తారు

నేను లేకుండా ఎలా చేస్తారు

ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ బయటపెట్టేసింది. నేను లేకుండా ఎలా చేస్తారు అంటూ తన కోపాన్ని చూపిస్తూ 'తెల్లవారితే గురువారం' యూనిట్ పై కౌంటర్లు వేసింది. ఇక మధ్యలో కమెడియన్ సత్య సుమ ఆంటీ అంటూ ఆట పట్టించాడు. అయినప్పటికీ సుమ కౌంటర్లు ఆగలేదు.

 అసలు కారణం ఇది.. ఎన్టీఆర్ వల్లే..

అసలు కారణం ఇది.. ఎన్టీఆర్ వల్లే..

అయితే ఎన్టీఆర్ కారణంగానే సుమను హోస్ట్ గా సెలెక్ట్ చేయలేకపోయినట్లు హీరో శ్రీ సింహా వివరించాడు. అసలు విషయంలోకి వెళితే.. ముందుగా ఎన్టీఆర్ ను హోస్ట్ గా పిలవాలని అనుకోగానే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే అదే రోజు సుమకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఎన్టీఆర్ కోసం సెట్ చేసిన తేదీని మార్చలేకపోయారట. ఆ విషయాన్ని శ్రీ సింహా, సుమకు క్లారిటీగా వివరించే ప్రయత్నం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X