twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిద్రపోనివ్వకుండా ఎంతలా టార్చర్ పెట్టిందో.. పీక్స్‌కు చేరిన సుమ శాడిజం!!

    |

    బుల్లితెరపై పంచ్‌ల ప్రవాహాం వెల్లువెత్తాలన్నా, సెటైర్ల సునామి రావాలన్నా సుమ అడుగుపెట్టాల్సిందే. బుల్లితెరపై సుమ చేసే సందడి గురించి తెలియని తెలుగు వారెవ్వరూ ఉండరు. తన యాంకరింగ్‌తో చిన్నా, పెద్దా, ముసలి ముతకా అని తేడా లేకుండా అందర్నీ కట్టిపడేసింది. తెలుగు వారంతా ప్రేమగా సుమక్క అనే స్థాయికి ఎదిగింది. ఇన్ని రోజులు మనకు సుమను తెరపై చూడటమే తెలుసు. ఇంట్లో ఎలా ఉంటుందన్న సంగతి మాత్రం అందరకీ అంతగా తెలియకపోవచ్చు.

    లాక్ డౌన్‌తో అలా..

    లాక్ డౌన్‌తో అలా..

    కరోనా వైరస్ విజృంభించడంతో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. దీంతో అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. అలా దాదాపు ఐదారు నెలలు అందరూ గడప దాటి బయటకు రాలేదు. ఈ క్రమంలో సుమ తన వ్యక్తిగత విషయాలకు కూడా అభిమానులతో పంచుకుంది. ఇంట్లో ఎంత సరదాగా, జాలీగా ఉంటుందో వివరించింది.

    గారెలు చేయడంలో శిక్షణ..

    గారెలు చేయడంలో శిక్షణ..

    లాక్ డౌన్‌లో వచ్చిన ఓ పండుగకు సుమ గారెలు చేసింది. వాటిని ఎలా చేయాలో ఓ వీడియో ద్వారా వివరించింది. అలా ఇంట్లో తానే వంట చేసుకుంటున్నానని తెలిపింది. అలీతో సరదాగా షోలో వచ్చినప్పుడు ఇదే విషయం చెబుతూ.. రోజుకో రకమైన వంటలు వండలేకపోయానని సుమ తన బాధను చెప్పుకొచ్చింది.

    జోరోను భయపెట్టింది..

    జోరోను భయపెట్టింది..

    ఇక లాక్డౌన్‌లో సుమ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. తన పెంపుడు కుక్క జోరోను భయపెట్టేసింది. రాములో రాముల అనే పాటకు డ్యాన్స్ చేసి.. జోరోను బెదిరిపోయేలా చేసింది. సుమ డ్యాన్స్ చేయడం ప్రారంభించిందో లేదో జోరో వెళ్లిపోయింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
    నిద్రపోనివ్వకుండా..

    నిద్రపోనివ్వకుండా..

    తాజాగా జోరోను సుమ ఎంతలా హింసించిందో వీడియో ద్వారా తెలుస్తోంది. జోరో చక్కగా నిద్రపోతుంటే.. దాన్ని సుమ డిస్టర్బ్ చేయడం ప్రారంభించింది. మొదటి సారి ఉలిక్కి పడి లేచింది. మళ్లీ ఎంతలా డిస్టర్బ్ చేసినా సరే నిద్రలేవలేదు. అలాగే పడుకుని ఉంది. ఇక చివరకు దాన్ని గట్టిగా ఊపే సరికి నిద్రలేచింది. షూటింగ్‌లు లేకపోతే ఇంట్లో చేసేది ఇదే అంటూ సుమ ఈ వీడియోను షేర్ చేసింది. ఎందుకలా డిస్టర్బ్ చేస్తావ్ అక్కా పడుకోనివ్వొచ్చు కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ సుమ మాత్రం ప్రేమతో కూడిన శాడిజాన్ని చూపించింది.

    English summary
    anchor Suma Disturbing zorro While Sleeping, Disturbing zorro This is what I do when dont shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X