నా ప్రియమైన రాజా అంటూ సుమ ఎమోషనల్.. ఇకనైనా ఆ రూమర్స్ ఆపండి బాబు!

టెలివిజన్ రంగంలో ఎంతమంది టాప్ యాంకర్స్ ఉన్నా కూడా సుమ రేంజ్ లో ఎవరు ఎంటర్టైన్ చేయలేరనే చెప్పాలి. దశాబ్ద కాలంగా తనదైన శైలిలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. స్టార్ హీరోలు కూడా తెలియని జనాలకు సుమక్క బాగా తెలుసు. అంతగా ఆమె ప్రతి ఇంట్లో ఒక స్పెషల్ బాండింగ్ క్రియేట్ చేసుకుంది. అలాంటి సుమ కెరీర్ లో కూడా కొన్ని రూమర్స్ అప్పుడప్పుడు అసహనానికి గురి చేశాయి.

షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా..

షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా..

యాంకర్ సుమ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఏ మాత్రం మిస్సవ్వదు. వీలైనంత వరకు వీకెండ్స్ లోనే కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేస్తుంది. యాక్టర్ రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమ ఒక విధంగా భర్త కంటే హై రేంజ్ లో క్రేజ్ అందుకుంది.

సుమ ఉంటే..టెన్షన్ లేనట్లే..

సుమ ఉంటే..టెన్షన్ లేనట్లే..

ఇక ఆదాయంలో కూడా సుమ నెంబర్ వన్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో అత్యంత కాస్ట్లీ యాంకర్ సుమ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుమ ఉందంటే చాలు ఆడియో వేడుకలో దర్శక నిర్మాతలు ఒక విధంగా టెన్షన్ లేకుండా ఉంటారు. ఇక అలాంటి సుమ కెరీర్ లో కొన్నిసార్లు రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి.

ప్రేమతోనే.. రూమర్స్ కి కౌంటర్

ప్రేమతోనే.. రూమర్స్ కి కౌంటర్

రాజీవ్ కనకాలతో సుమకు విబేధాలు వచ్చినట్లు చాలా సార్లు అనేక రకాల తప్పుడు వార్తలు వైరల్ అయ్యాయి. వాటి గురించి సుమ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నడు కూడా వివరణ ఇవ్వాలని కూడా అనుకోలేదు. కానీ ప్రేమతోనే ఆ రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇటీవల ఆమె ట్విట్టర్ లో చేసిన ఒక స్పెషల్ ఫొటో వైరల్ గా మారింది. రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హద్దుకొని ఎమోషనల్ గా భావాన్ని చూపించింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Vadthya మాస్.. అవి కొంచమ్ తగ్గించుకుంటే మంచిది..!!
ఎప్పటికైనా నువ్వే నా జీవితం

ఎప్పటికైనా నువ్వే నా జీవితం

ఇక ఫోటోకి తగ్గట్టుగానే సుమ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. నా ప్రియమైన రాజా.. మై లవ్..ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం.. అంటూ సుమ చేసిన పోస్ట్ తో వారి మధ్య ప్రేమ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చెలుకోవచ్చు. బ్యూటీఫుల్ కపుల్స్ అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంత మంచి జంటపై తప్పుడు వార్తలు రాయవద్దని, అనవసరమైన రూమర్స్ ఆపండి రా బాబు అంటూ మరికొందరు వివరణ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X