Anchor Suma : రాజీవ్ కనకాలపై యాంకర్ సుమ ఎమోషనల్ పోస్ట్.. ఇబ్బంది పడ్డావా అంటూ !
యాంకర్ సుమ చాలా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమా ఈవెంట్లు మరోపక్క టీవీ షోలతో ఆమె రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఆమెకు రాజీవ్ కనకాల కు మధ్య దూరం పెరుగుతుందని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారని అడపాదడపా వార్తలు వస్తున్నాయి.. మొదట్లో వీళ్ళు పట్టించుకున్నారు గాని తర్వాత లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే తాజాగా సుమ రాజీవ్ కనకాల గురించి రాసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎమోషనల్ పోస్ట్
చాలా కాలంగా రాజీవ్ కనకాల, సుమ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉన్నా మళ్ళీ పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అయితే లవ్ స్టోరీ సినిమా గురించి తన భర్తను పొగుడుతూ సుమ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇక నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరీ'. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 2, 2020 లో రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

మంచి స్పందన
భారత్‌లో కరోనా పరిస్థితలు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేసింది. అయితే అదే సమయానికి నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమాను వాయిదా వేసి సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.

మళ్లీ బిజీ
నటనలో ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తీసుకున్న రాజీవ్ కనకాల ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్నారు.. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు లవ్ స్టోరీ లో ఒక కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నారు. లవ్ స్టోరీ సినిమా లో రాజీవ్ కనకాల సాయిపల్లవి బాబాయ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో కూతురు వరసయిన చిన్ననాటి సాయి పల్లవి మీద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిగా రాజీవ్ కనకాల నటించాడు. అయితే నిజానికి రాజీవ్ లాంటి నటుడు ఇలాంటి పాత్రలు చేయడం అంటే కొంచెం కష్టమైన పనే.

భర్త నటన అద్భుతం
ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కు పోకుండా దర్శకుడు తనకు చెప్పిన పాత్రను నూటికి నూరు శాతం చేసి చూపించడం తో నటుడిగా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.. అయితే తాజాగా తన భర్త రాజీవ్ పాత్ర మీద సుమ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా 'లవ్ స్టోరీ' సినిమా మీద ఆమె ప్రశంసలు కురిపించింది. తన భర్త నటన అద్భుతంగా ఉందని ఆమె పేర్కొంది.

రాజీవ్ కి సుమ అభినందన
సినిమా సెట్‌లో శేఖర్ కమ్ములతో రాజీవ్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. అతి తక్కువ మంది నటీనటులు మాత్రమే తన నటనతో మన మనస్సులను తాకుతారు.. అలాంటి నటీనటుల్లో నా భర్త రాజీవ్ కూడా ఒకరని ఎంతో ఎమోషనల్ అయింది. 'నరసింహ'గా ఎంతో అద్భుతంగా నటించినందుకు రాజీవ్ కి సుమ అభినందనలు చెప్పింది. ఈ పాత్ర చేయడానికి నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు కానీ ఎంతోమంది జీవితాలను నువ్ ప్రభావితం చేశావంటూ భర్త గురించి ఆమె చెప్పుకొచ్చింది.

శేఖర్ కమ్ముల, నాగ చైతన్యలకు థాంక్స్
అలాగే ఇలాంటి సున్నితమైన కథను మరింత సున్నితంగా తెరకెక్కించిన శేఖర్ కమ్ముల, నాగ చైతన్యలకు థాంక్స్ చెప్పింది సుమ. సాయి పల్లవి డాన్స్ చూసి తన కళ్లు అలసిపోయాయని.. డాన్స్ ఎక్కడ మిస్ అవుతానో అని కంటిరెప్ప కూడా వాల్చలేదని ఆమె ప్రసంశలు వర్షం కురిపించింది. కూతురు వరసయ్యే పాప మీద లైంగిక దాడి చేసే పాత్రలో రాజీవ్ ని చూసిన ప్రేక్షకులు మాత్రం షాకయ్యారని చెప్పాలి.


Click it and Unblock the Notifications











