For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవర్స్‌కు సరైన ప్లేస్ అదే.. అక్కడ చాలా ప్రైవసీ.. యాంకర్ సుమ మామూల్దిది కాదు!

  |

  బుల్లితెరపై యాంకర్ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణి సుమ. దశాబ్దానికిపైగా సుమ తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను సుమక్క అని ప్రేమగా పిలుస్తుంటారు. అలా ఆ పేరుతోనే సుమ ఓ యూట్యూబ్ చానెల్‌కు కూడా ప్రారంభించేసింది. లాక్డౌన్ సమయంలో సుమ తన యూట్యూబ్ ప్రమోషన్స్ మీద బాగానే ఫోకస్ పెట్టేసింది. అయితే బుల్లితెర మీద మాత్రం సుమ తన పట్టును వీడలేదు.

  హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)

  పలు షోలతో బిజీగా..

  పలు షోలతో బిజీగా..

  ప్రస్తుతం సుమ ప్రతీ చానెల్‌లో కనీసం ఓ షో చేస్తోంది. ఈటీవీలో క్యాష్, స్టార్ మహిళా, స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్, జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి షోలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ఇక ప్రతీవారం సినిమాల దాడి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో వీకెండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లంటూ బిజీగా ఉంటోంది.

  తాజాగా అలా..

  తాజాగా అలా..

  తాజాగా సుమ హోస్ట్‌గా వచ్చే క్యాష్ ప్రోమో హల్చల్ చేస్తోంది. వచ్చే వారం శశి మూవీ యూనిట్ గెస్టులుగా వచ్చింది. హీరో ఆది, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు క్యాష్ ఆట ఆడేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారినే సుమ రివర్స్‌లో ఆట ఆడుకుంది.

  పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

  పంచ్‌ల వర్షం..

  పంచ్‌ల వర్షం..

  సుమ యాంకర్‌గా ఉన్న షోలో పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అలానే శశి టీం మీద సుమ సెటైర్లతో దాడి చేసింది. అందరి కంటే ఎక్కువగా దర్శకుడిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. శశి మూవీ థీం ఏంటి ఆది? అని సుమ అడిగింది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని ఆది చెప్పుకొచ్చాడు. అవును ఇంటెన్స్ స్టోరీ అని అర్థమవుతోంది.. మీ డైరెక్టర్ ఇంటెన్స్‌తో చూస్తున్నారు అని కౌంటర్ వేసింది సుమ.

  మీ ఆవిడ పేరు ఏంటి

  మీ ఆవిడ పేరు ఏంటి

  మీది కాకినాడలో ఆదిత్య కాలేజ్ కదా? రెండు జెళ్ల సీత అంటూ ఏదో గుర్తు చేసేందుకు ప్రయత్నించింది సుమ. ఏమో అండి గుర్తు లేదని దర్శకుడు శ్రీనివాస్ నాయుడు అన్నారు. మీ ఆవిడ వచ్చిందా? అని సుమ అంటే.. అవును అని సమాధానం ఇచ్చాడు. మీ ఆవిడ పేరు ఏంటి అని సుమ అడిగితే.. కాస్త గ్యాప్ ఇచ్చి కనక అని సమాధానమిచ్చాడు దర్శకుడు. ఎందుకు కాస్త ఆలోచించి చెప్పారంటూ మరో కౌంటర్ వేసింది సుమ.

  ప్రేమికులకు సరైన ప్లేస్..

  ప్రేమికులకు సరైన ప్లేస్..

  సుమ టూరిజం అనే కాన్సెప్ట్‌తో శశి టీంను ఆడుకుంది. మా టూరిజంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ప్రేమికులకు ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్తామని ఆది, సురభిలకు చెప్పింది సుమ. తీరా చూస్తే స్మశాన వాటికను చూపించింది. నేను చెబుతున్నాను.. లవర్స్‌కు ఇంతకన్నా ప్రైవసీ ఎక్కడా దొరకదు అని సుమ తెలిపింది.

  ఎవ్వరూ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు.. ఒక్క కాటికాపరి తప్పా, పార్కుల్లో అయితే పోలీసులు వచ్చి లేపుతారు.. కానీ ఇక్కడైతే మనమే లేచిపోవాలి.. అని సుమ కౌంటర్ వేసింది.

  English summary
  Anchor Suma Fun with Sashi Movie Team In Cash show..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X