ప్రెగ్నెన్సీ సీక్రెట్ బయటపెట్టిన యాంకర్ సుమ.. మూడో బిడ్డను కనడంపై తొలిసారి కామెంట్
తెలుగు బుల్లితెరపై తిరుగులేని విధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతూ దూసుకుపోతోంది టాలెంటెడ్ లేడీ సుమ కనకాల. తనదైన డైలాగులు, పంచులు, ప్రాసలతో మెప్పిస్తోన్న ఈమె.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో వరుసగా షోల మీద షోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ కనకాల.. తన మూడో బిడ్డ గురించి ఫన్నీగా కామెంట్లు చేసింది. అసలు ఆమె ఏమందో మీరే చూసేయండి!
బుల్లితెరపై బడా స్టార్‌గానే
టెలివిజన్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా సుమ.. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గానూ సత్తా చాటుతోంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తోంది.

అన్నింట్లోనూ హైలైట్‌గా
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ప్రభావం చూపిస్తోన్న సుమ.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. సుమ వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలు చేస్తోంది.
క్యాష్ ప్లేస్‌లో సుమ అడ్డా
సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతూ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. అలాంటిది ఈ షోను గత ఏడాది నిలిపేశారు. దీని స్థానంలో 'సుమ అడ్డా' అనే షోతో సుమ వచ్చేసింది.

సీరియల్ తల్లులతోనే
సుమ అడ్డా షోను ప్రతి వారం సెలెబ్రిటీలతో ప్లాన్ చేస్తుంటారన్నది తెలిసిందే. ముఖ్యంగా అక్కడకు వచ్చే గెస్టులతో సుమ చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు. ఇక, వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం సీరియల్ నటీనటులను తీసుకు వచ్చారు. ఇటీవలే తల్లి, తండ్రి అయిన ఈ సెలెబ్రిటీలతో కలిసి యాంకర్ సుమ మంచి ఫన్ క్రియేట్ చేసింది.
మిమ్మల్ని చూస్తే కుళ్లు
'సుమ అడ్డా' షోలో భాగంగా గెస్టులుగా వచ్చిన సెలెబ్రిటీలతో యాంకర్ సుమ 'రీసెంట్‌గా పిల్లలు పుట్టిన మీలాంటి వాళ్లను చూసే నాకు చాలా కుళ్లుగా ఉంటుంది. ఎందుకంటే మీరు రీల్స్ చేసుకోవచ్చు. డైపర్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు. నేనేమో ఇలాంటి గొట్టాలను ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది' అంటూ పంచ్‌లు వేసింది. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు.

నేను అందుకే ఆపానని
'సుమ అడ్డా' షోలో సీరియల్ హీరోయిన్ 'బ్రేక్ తర్వాత నేను బాబును కన్నాను. ఇది పాపను కనేసింది. వాడు బాబును కనేశాడు' అని చెప్పింది. అప్పుడు యాంకర్ సుమ కలగజేసుకుని 'ఆగండి.. మీకు అర్థం అవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో. తర్వాత మూడో బిడ్డను కనేందుకు బ్రేక్ దొరకలేదు' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











